ప్రచురణ తేదీ : Jul 12, 2018 1:28 AM IST

పాయింట్ దొరికిందని, రేణుని నిలదీస్తున్న పవన్ అభిమానులు!


జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనతో 11 ఏళ్లపాటు కాపురం చేసి ఆతరువాత విదేశీ యువతితో సంబంధం పెట్టుకుని ఒక బిడ్డను కన్నారు, అని పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ చేస్తున్న ఆరోపణలపై నేడు కొందరు పవన్ అభిమానులు ఆమెని సూటిగా ఒక ప్రశ్న వేశారు. ఇప్పటికే పవన్ నుండి విడాకులు పొందిన ఆమె, ఇటీవల సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తూ, అసలు పవన్ అభిమానులు నా వ్యక్తిగత జీవితంలో ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారో అర్ధం కావడంలేదని, అయినా అసలు మా విడాకుల విషయంలో జరిగిన వాస్తవాలను కనుక మీరు బయటపెడితే మీరు సమాధానం చెప్పలేరని అన్నారు. ఆ తరువాత ఆమె తన ట్విట్టర్ ఖాతాను తొలగించారు. అప్పటినుండి ఆమె పై కొంత ట్రోలింగ్ మాత్రం ఇప్పటికీ ఆగడం లేదు.

అయితే ఆమె పవన్ పై చేస్తున్న ఆరోపణలకు సంబంధించి ఒక పాయింటు దొరికిందట, అది ఏంటంటే, అసలు పవన్ కు రేణుకు విడాకుల విషయం జరిగింది 2011లో అయితే, పవన్ అన్న లెజెనోవాతో 2013లో బిడ్డను కంటే, అందులో రేణుకు వచ్చిన సమస్య ఏంటని వారు సోషల్ మీడియాలో ప్రశ్నలు సంధిస్తున్నారు. అయితే పవన్ అభిమానులు లేవనెత్తుతున్న ఈ విషయంపై మిశ్రమ స్పందన వస్తోంది. కొందరేమో రేణును సమర్దిస్తుంటే, మరికొందరేమో ఆమె పవన్ పై చేస్తున్న వ్యాఖ్యలు అవాస్తవమని కొట్టిపారేస్తున్నారు. ఎంతైనా ఆమె స్త్రీ కాబట్టి ఒకరితో విడాకుల తరువాత ఆమె జీవితం, ఆమెకు నచ్చినట్లు జీవిచవచ్చని, దానిలో ఎవరి అభిప్రాయం కూడా అవసరం లేదనేది మరి కొందరి వాదన. కాగా ఇలా రకరకాలుగా సాగుతున్న పవన్, రేణుల ఎపిసోడ్ కి ఎప్పుడు తెరపడుతుందో చూడాలి మరి….

Comments