షాకింగ్ న్యూస్ : అక్కడ ల్యాప్ టాప్ లను కిలోల్లెక్కన అమ్ముతుంటారు!!
సాధారణంగా మనం వాడుకునే పర్సనల్ కంప్యూటర్ అయితే రూ. 15 వేల నుండి అలానే ఒక్కో ల్యాప్ టాప్ రూ.30 వేలు మొదలు రూ.లక్ష వరకు బహిరంగ మార్కెట్లో మనకు దొరుకుతుంటాయి. కానీ ఒకచోట మాత్రం ల్యాప్టాప్ లను కేజీల లెక్కన అమ్ముతుంటారు. ల్యాప్ టాప్ ను కిలోల లెక్కన అమ్మే బజార్ దేశంలో ఒకటి ఉంది. ఇక్కడ ల్యాప్ టాప్ లతో పాటు, సెల్ ఫోన్లను కారుచౌకగా అమ్మేస్తుంటారన్న పేరు ఉంది. దేశ రాజధాని ఢిల్లీలోని నెహ్రూ ప్లేస్ లో ఉన్న మార్కెట్లో ల్యాపీలను కిలోల లెక్కన అమ్మేస్తుంటారు. మంచి కండీషన్లో ఉన్న ల్యాప్ టాప్ లు రూ.5 వేలకు కూడా దొరికేస్తుంటాయి.
దేశంలోనే అత్యంత చౌకగా ల్యాపీలు దొరికే ప్లేస్ గా నెహ్రూ మార్కెట్కు పేరుంది. అయితే ఇక్కడ దొరికే ల్యాప్ టాప్ ల కండీషన్ ను ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకున్న తర్వాత కొనుగోలు చేయటం మంచిదని ఇక్కడకు వచ్చే పలువురు కస్టమర్లు అంటుంటారు. ఫస్ట్ హ్యాండ్ ల్యాపీలనే కాదు, సెకండ్ హ్యాండ్ లాపీలను కూడా ఇక్కడ అమ్ముతుంటారు. వీటితో పాటు సెల్ ఫోన్లను చౌకగా అమ్మేయటం ఈ మార్కెట్ స్పెషాలిటీగా చెప్పొచ్చు. మరి ఇంకెందుకు ఆలసయం మీకు కూడా కావాలంటే చలో ఢిల్లీ మరి….