ప్రచురణ తేదీ : Dec 1, 2017 6:22 PM IST

కోహ్లీని ప్రశ్నించిన ప్రపంచ సుందరి

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి క్రేజ్ ఏ స్థాయిలో ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక్క ఇండియాలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా కోహ్లీకి అభిమానులు చాలానే ఉన్నారు. అయితే దిల్లీలో జరిగిన ‘సీఎన్‌ఎన్‌ న్యూస్‌ 18’ అవార్డుల ప్రదానోత్సవంలో మిస్ వరల్డ్ మానుషి ఛిల్లర్‌ కోహ్లీతో మాట్లాడి ఒక అభిప్రాయాన్ని చెప్పమని కోరారు. అందుకు విరాట్ కూడా చాలా సున్నితంగా సమాధానాన్ని ఇచ్చాడు. వేడుకలో విరాట్ పాపులర్‌ ఛాయిస్‌ స్పెషల్‌ అఛీవ్‌మెంట్‌ పురస్కారాన్ని అందుకున్నాడు.

ఈ సందర్బంగా మానుషీ మాట్లాడుతూ.. కోహ్లీ అవార్డ్ అందుకున్నందుకు శుభాకాంక్షలు. వరల్డ్ లోనే బెస్ట్ బ్యాట్స్ మెన్ గా గుర్తింపును అందుకున్నారు. నిన్ను స్ఫూర్తిగా తీసుకొని ఎంతమంది యువ క్రికెటర్లు వారి సత్తాను చాటుతున్నారు. అయితే వారికి నువ్వు ఇచ్చే సలహా ఏంటి అని చెబుతూ.. ముఖ్యంగా చిన్న చిన్నారులకు ఎలాంటి సలహాలు ఇస్తారని ప్రశ్నించారు. అందుకు సమాధానంగా కోహ్లీ.. ఆటలో ఎప్పుడు ఎలాంటి ఆలోచనతో కొనసాగాలి అనే విషయం చాలా ముఖ్యంగా. ఆ ఆలోచన మన హార్ట్ లో నుండి రావాలి. గ్రౌండ్ లో మనల్ని మనం నిరూపంచుకోవాలి. అప్పుడే అభిమానులను గెలుచుకోగలం. నేను ఎప్పుడు నాలానే ఉంటాను. మరొకరిలా ఉండాలని అస్సలు అనుకోను. ఇక న ప్రవర్తనపై ఎవరు ఎన్ని అభ్యంతరాలు తెలిపినా అస్సలు పట్టించుకోను అని విరాట్ సమాధానం ఇచ్చాడు. ఆ తర్వాత తన చేతుల మీదుగా ప్రపంచ సుందరి మానుషి కి ‘ప్రత్యేక అఛీవ్‌మెంట్‌’ అవార్డును కోహ్లీ అందజేశాడు.

Comments