మెగాస్టార్ కోసం .. ఆ పార్టీలు గాలం వేస్తున్నాయి ?


మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ లో మళ్ళీ తన సత్తా ను ప్రూవ్ చేసుకున్నాడు. ఇక రాజకీయంగా కూడా కాంగ్రెస్ ని బలోపేతం చేయాలనీ ప్లాన్ చేస్తున్నాడు. అయితే వచ్చే ఏడాదితో అయన రాజ్యసభ ఎంపీగా పదవీకాలం ముగియడంతో ఇప్పుడు మెగాస్టార్ ను తమ పార్టీలో కి లాగేందుకు ఇతర పార్టీలు గట్టిగానే ప్రయత్నాలు మొదలు పెట్టాయట. వచ్చే రాజ్యసభకు మళ్ళీ చిరంజీవిని ఎంపిగా నామినేట్ చేస్తామని సదరు పార్టీలు భారీ అఫర్ ని ప్రకటిస్తూన్నాయట ? ప్రజారాజ్యం స్తాపించి .. దాన్ని కాంగ్రెస్ లో విలీనం చేసిన చిరంజీవికి కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యత్వాన్ని ఇచ్చి, కేంద్ర మంత్రిగా పదవీబాధ్యతలు అందించింది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడంతో అయన కేవలం రాజ్యసభ ఎంపీగా ఉన్నాడు .. దాంతో చిరంజీవి ఇమేజ్ ని ఉపయోగించుకోవాలని అటు వైఎస్ఆర్ సిపి, ఇటు టీడీపీ కూడా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మెగాస్టార్ తో మంతనాలు జరిపేందుకు కొందరు పెద్దలను రంగంలోకి దింపాలని యోచిస్తున్నారట !! ప్రజారాజ్యం పార్టీ నేతలు ఈ రెండు పార్టీల్లో ఉన్నారు కాబట్టి వారితో చర్చలు జరుపనున్నారు. ఇప్పటికే అటు ఆంధ్రా , ఇటు తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ భారీ పరాజయాన్ని పొందడంతో వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పరిస్థితి మారేలా కనిపించడం లేదు కాబట్టి .. చిరంజీవి పార్టీ మారొచ్చని సదరు పార్టీల వాళ్ళు భావిస్తున్నారు. చూద్దాం .. ఏమి జరుగుతుందో.

Comments