ఆ ప్రాంతాన్ని పచ్చ చొక్కాలు పీక్కు తింటున్నాయి : వైఎస్ జగన్

ప్రస్తుతం తన ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా ప్రస్తుతం గుంటూరు జిల్లా లో వైఎస్సాఆర్ పార్టీ అధినేత జగన్ పర్యటిస్తున్నారు. యాత్రలో భాగంగా తెనాలిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్ జగన్ ప్రసంగిస్తూ ఇటు రాజకీయాలపై అటు ప్రజా సంక్షేమంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాలుగేళ్ల పాలనలో జరిగిన అవినీతిపై ఎక్కడా విచారణ చేపడుతారో అన్న భయం చంద్రబాబుకు పట్టుకుందని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రత్యేక హోదా కోసం సీఎం హోదాలో కేంద్రాన్ని అడిగి ఉంటే ఎప్పుడో వచ్చేదని కానీ అలా చేయకుండా ఐదు కోట్ల మంది ప్రజలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని ఆయన ధ్వజమెత్తారు. తెనాలి ప్రాంతాన్ని ఆంధ్ర ప్యారీస్ గా కూడా పిలుస్తారని కవులకు, కళాకారులకు ఇది నిలయమని జగన్ అన్నారు.

ఇంతటి గొప్ప చరిత్ర ఉన్న ఈ ప్రాంతాన్ని పచ్చ చొక్కాలు పీక్కుతింటున్నాయన్నారు. ఇవాళ ఇక్కడికి వచ్చే సమయంలో అడుగడుగునా అన్నా, కృష్ణా నదిని ఇష్టం వచ్చినట్లు ఇసుకను దోచుకుంటున్నారని రైతులు చెబుతున్నారు. ఎమ్మెల్యేలు జన్మభూమి కమిటీలు కలెక్టర్ వరకు లంచాలు చిన్నబాబు పెద్దబాబు జేబుల్లోకి లంచం సొమ్ము వెళ్తోంది. ఇంత అన్యాయంగా ముఖ్యమంత్రి భాగస్వామి ఉండి ఇసుకను దోచుకుంటుంటే ఇంకెవరు న్యాయం చేస్తారు అని జగన్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు గట్టిగా అడిగి ఉంటే ఈ పాటికి హోదా వచ్చి ఉండేదని, కానీ ఆయన ప్రజాసంక్షేమం కంటే తమపార్టీ సంక్షేమం కోసం రాష్ట్రాన్ని కేంద్రానికి తాకట్టు పెట్టి ప్రత్యేక ప్యాకెజీ కి ఒప్పుకున్నారని జగన్ అన్నారు.

ఈ పెద్ద మనిషి చేస్తున్న మోసం ప్రజలను ప్రత్యేక హోదా విషయంలో మభ్యపెట్టడమే. ఇవాళ మన పార్టీకి చెందిన ఐదుగురు ఎంపీలు తమ పదవులకు రాజీనామాలు చేసి మనకు జరిగిన అన్యాయాన్ని దేశానికి చూపాలని ఆమరణ దీక్షకు కూర్చున్నారు. ఈ ఐదుగురు ఎంపీలకు తోడు 25 మంది ఎంపీలు ఒకతాటిపైకి వచ్చి రాజీనామాలు చేసి ఉంటే దేశం మొత్తం చర్చనీయాంశం అయ్యేది. ప్రధాని దిగి వచ్చి ప్రత్యేక హోదా ఇచ్చి ఉండేవారు కాదా, అలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు చేస్తున్నది ఏంటో తెలుసా అఖిలపక్షం అంటూ డ్రామాలు ఆడుతున్నారు. ఎంపీలతో రాజీనామాలు చేయించడం లేదు. ఇదే పెద్ద మనిషి సిగ్గు లేకుండా ఏపీకి చెందిన ఐదు కోట్ల మంది ప్రజలకు వెన్నుపోటు పొడిచారు. దివంగత వైఎస్ తనయుడిగా సంక్షేమంలో మరో రెండు అడుగులు ముందుకు వేస్తాను. పేదవాడి వైద్యం ఖర్చు వెయ్యి దాటితే చాలు ఆరోగ్యశ్రీ కిందకు తీసుకువస్తాను. ఉచితంగా వైద్యం అందిస్తాను. ప్రతి పేదవాడికి ఆపరేషన్ తరువాత డాక్టర్లు రెస్టు తీసుకోమని చెబుతారు.

ఆ సమయంలో ఆ కుటుంబం పస్తులు ఉండకూడదని విశ్రాంతి తీసుకునే సమయంలో కూడా డబ్బులు ఇచ్చి తోడుగా ఉంటాను. ఏ పేదవాడు కూడా పస్తు పడుకునే పరిస్థితి రానివ్వను. హైదరాబాద్, బెంగళూరు వెళ్తే ఆపరేషన్ చేయించను అని చంద్రబాబు అంటున్నారు. మన ప్రభుత్వం వచ్చాక ఎక్కడ ఆపరేషన్ చేయించుకున్నా ఉచితంగా చేయిస్తాం. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రతి నెల రూ.10 వేలు పింఛన్ ఇస్తామని మాట ఇస్తున్నాను. అంటూ జగన్ తన ప్రణాళిక వివరించారు. చంద్రబాబు ఇకనైనా బుడ్డి తెచ్చుకుని ఏపీ కి జరిగిన అన్యాయం పై సరైన నిర్ణయం తీసుకుంటే మంచిదని, ఆదేవుడు ఆయనకు అటువంటి బుద్ధి ప్రసాదించాలని ఆయన హితవుపలికారు……

Comments