ప్రచురణ తేదీ : Mar 13, 2018 2:30 PM IST

ఆ కాంగ్రెస్ ఎమ్యెల్యే ల పై వేటు!!

అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం సందర్భంగా జరిగిన ఘటనను తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. సభ మొదలైన వెంటనే స్పీకర్ మధుసూదనాచారి నిన్నటి ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ దీన్ని దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. సభలో అవాంఛనీయ ఘటనకు పాల్పడిన 11 మంది కాంగ్రెస్ సభ్యులను ఈ బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేస్తున్నట్లు శాసనసభా వ్యవహారాల మంత్రి హరీష్‌రావు ప్రకటించారు. అలాగే మండలి చైర్మన్ స్వామిగౌడ్‌పై హెడ్‌ఫోన్‌ విసిరి గాయపర్చారంటూ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌‌ల శాసనసభ సభ్యత్వాలను రద్దు చేశారు. జానారెడ్డి, జీవన్‌రెడ్డి, గీతా‌రెడ్డి, చిన్నారెడ్డి, ఉత్తమ్‌కుమార్, డి.కె.అరుణ, మల్లు భట్టి విక్రమార్క, పద్మావతిరెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, వంశీచందర్‌రెడ్డి, మాధవరెడ్డిలను సస్పెండ్ చేయాలంటూ మంత్రి హరీష్‌రావు ప్రవేశపెట్టిన తీర్మానానికి స్పీకర్ మధుసూదనాచారి ఆమోదం తెలిపారు. ఈ విధమైన దుశ్చర్యలకు పాల్పడడం కాంగ్రెస్ కు తగదని ఈ సందర్భంగా స్పీకర్ అన్నారు. సభలో సభా మర్యాదను ప్రతిఒక్కరు పాటించాలని హితవు పలికారు…

Comments