ప్రచురణ తేదీ : Dec 6, 2017 10:36 AM IST

రణరంగంగా సీబీఐటీ..విద్యార్థులపై లాఠీ ఛార్జ్..!

హైదరాబాద్ గండిపేటలోని సీబీఐటీ కళాశాలలో యాజమాన్యం దారుణంగా ప్రవర్తిస్తోంది. ఫీజుల పేరుతో విద్యార్థులని మేనేజ్ మెంట్ వేధిస్తుండడంతో కళాశాల వాతావరణం రణరంగంగా మారింది. పోలీస్ లు రంగంలోకి దిగి విద్యార్థుల పై లాఠీ ఛార్జ్ చేయడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి.

కళాశాలలో ఫీజుల పెంపు వ్యవహారం వివాదంగా మారింది. కళాశాల యాజమాన్యం ఇష్టం వచ్చినట్లు పీజులు పెంచుతూ తానేమి చదువుకోనిచ్చే పరిస్థితి కల్పించడం లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే అధికపీజులు చెల్లించలేక నానా తంటాలు పడుతూ చదువు కొనసాగిస్తున్నామని విద్యార్థులు అన్నారు. తాజాగా పెంచిన ఫీజులతో తాము చదువుకునే పరిస్థితి లేదని వాపోతున్నారు. ఈ వ్యవహారం విద్యార్థులకు, కళాశాల ప్రిన్సిపాల్ కు మధ్య వివాదంగా మారింది. ప్రిన్సిపాల్ తో గొడవ ఎక్కువకావడంతో పోలీస్ లు విద్యార్థులపై లాఠీ ఛార్జ్ చేశారు. కాలేజీ యాజమాన్యానికి, పోలీస్ లకు నిరసనగా గేటువద్దే విద్యార్థులు భారీ ఆందోళన చేపడుతున్నారు.

Comments