దుబాయ్ లాటరీలో ఆ తెలుగు వ్యక్తికి అదృష్టం వరించింది! ఎలా అంటే?

లాటరీ అనేది ఒక వ్యసనం లాంటిది. ఒక్కసారి దానికి కనెక్ట్ అయితే అలా ఏదో ఒక మూల ఆశతో ఎప్పుడు టికెట్ కొంటూనే ఉంటాం. అలాగే ఉపాధి కోసం దుబాయ్ కి వెళ్ళిన ఓ తెలుగు యువకుడుకి ఏకంగా 8 కోట్ల పైన లాటరీ రావడం ఇప్పుడు అతని ఆనందానికి హద్దులు లేవు. వివరాల్లోకి వెళ్తే దుబాయ్ లో ఉంటున్న కృష్ణం రాజు ఎప్పటి లానే లాటరీ టికెట్ కొనుక్కొని వెళ్ళాడు. అయితే అనుకోకుండా అతనికి ఫోన్ వచ్చింది. మీ లాటరీ టికెట్ కి 8 కోట్ల లాటరీ వచ్చింది. ఇక అతనికి నోటి వెంట మాట రాలేదు. దుబాయ్ లో బిగ్ 5 టికెట్ డే లాటరీ తాజా విజేత గా నిలిచినట్లు నిర్వాహకులు కూడా ప్రకటించారు. 2౦౦8 లో యూఎఈకి వచ్చి నిర్మాణం రంగంలో చిరు ఉద్యోగిగా ఉన్న అతని సంపాదన అంతంత మాత్రం కావడంతో అప్పులు పెరిగి, అప్పులు ఇచ్చే వారి నుంచి వేధింపులు ఎదురవుతున్నాయి. అయిన అతనికి అలవాటైన లాటరీ టికెట్ కొంటూనే ఉన్నాడు. ఇప్పుడు ఆ లాటరీ టికెట్ అతనికి 8 కోట్లు రూపాయిలు అతనికి వచ్చేలా చేసింది. లాటరీతో వచ్చే సొమ్ముతో తన కొడుకుని చదివించడంతో పాటు. అప్పులు తీరుస్తానని కృష్ణం రాజు ఈ సందర్భంగా చెప్పాడు.

Comments