ప్రచురణ తేదీ : Wed, Sep 13th, 2017

తెలుగుకి ఇక తెగులు పట్టదు.. తొందరలోనే అలా జరుగుతుంది!

పిల్లజమిందార్ సినిమాలో సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. పక్కరాష్ట్రాల వారు భాష.. భాష అంటూ ఉంటె మనం మాత్రం తెలుగు భాష ఎప్పుడు చచ్చిపోతుందా అని ఎదురుచూస్తున్నాం. అని. నిజంగా ఆ మాటలో చాలా గొప్ప అభిప్రాయం ఉంది. తెలుగు రాష్ట్రాల్లోనే తెలుగు భాషపై ఎంత చిన్న చూపు ఉందో ఆ ఒక్క మాటతో రచయిత చక్కగా చెప్పాడు. పొరుగు రాష్ట్రాల్లో భాష కోసం ప్రత్యేకంగా ఉద్యమాలు చేస్తున్నారు. ప్రభుత్వాలు కూడా అక్కడి ప్రాంతీయ భాషకి చాలా ప్రాముఖ్యం ఇస్తున్నాయి. అలాగే ప్రజలు కూడా ప్రాంతీయ భాష తర్వాతే ఏదైనా అనేంతగా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ప్రజలు ఉన్నారు. కాని మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం తెలుగుని మరిచిపోయి ఆంగ్లం వైపు పరుగులు పెడుతున్నాం. చిన్నప్పటి నుంచి పిల్లలని ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ లో జాయిన్ చేస్తూ, పిల్లలు ఇంగ్లీష్ లో మాట్లాడుతూ ఉంటె మురిసిపోతూ ఉన్నారు. అయితే తాజాగా తెలంగాణలో కేసీఆర్ తీసుకునే నిర్ణయం ఒక్కసారిగా తల్లిదండ్రులకి, ఇక ప్రైవేట్ స్కూల్స్ కి అదిరిపోయే షాకింగ్ తగలింది.

ఇక అసలు విషయం ఏంటంటే. తెలంగాణాలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి తెలుగు భాష తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం కొత్త విధానం తీసుకొస్తుంది అని ముఖ్యమంత్రి కెసీఆర్ తాజాగా చెప్పారు. ఒకటి నుంచి ఇంటర్ వరకు ప్రతి ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలలో తెలుగు మొదటి సబ్జెక్టు గా ఉండాల్సిందే అని చెప్పారు. అలాగే ప్రభుత్వం తయారు చేసిన సిలబస్ మాత్రమె అన్ని విద్యాసంస్థలలో బోధించాలని అలా కాకుండా ఎవరికీ వారు ప్రత్యేకంగా పుస్తకాలు తయారు చేసుకుంటే వారి మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుందని తేటతెల్లం చేసారు. ఇక ఎక్కడిన ప్రభుత్వ, ప్రైవేట్ బోర్డులు అన్ని కచ్చితంగా తెలుగులోనే ఉండాలని నిర్ణయించారు. ఇక సిలబస్ బాద్యత సాహిత్య అకాడమి చూసుకుంటుందని, అలాగే, అకాడమి ఆధ్యర్యంలో ప్రతి ఏడాది తెలుగు మహా సభలు జరుగుతాయని కేసీఆర్ స్పష్టం చేసారు. ఇక పాఠశాలలో తెలుగు భోధించే విద్యాసంస్థలకే అనుమతి ఉంటుందని కూడా స్పష్టం చేసారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయంపై తెలుగు భాషాభిమానులు, తెలుగు సంస్కృతి పరిరక్షకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ తీసుకున్న ఈ సాహసోపేత నిర్ణయంతో ఇక తెలుగు చచ్చిపోతుంది అని బాధపడే రోజు రాదని కూడా గర్వంగా చెబుతున్నారు. ఇక కేసీఆర్ పంథాలో ఆంధ్రాలో చంద్రబాబు కూడా తెలుగు తప్పనిసరి చేయాలని చాలా మంది కోరుతున్నారు. అయితే మరో వైపు కీసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయంపై చాలామంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ దెబ్బతో ఆయన ఇమేజ్ ఎక్కడికో వెళ్ళిపోవడం గ్యారెంటీ అని చెప్పుకుంటున్నారు. తెలంగాణా బ్రాండ్ ఇమేజ్ కి కేసీఆర్ కరెక్ట్ నిర్వచనం చెబుతున్నారని కూడా అంటున్నారు. మరి కేసీఆర్ ని చూసిన ఆంధ్రాలో చంద్రబాబు తెలుగు భాష మీద నిర్ణయం తీసుకుంటాడో లేదో చూడాలి.

Comments