సౌదీలో రోడ్డున పడ్డ తెలుగు కార్మికులు! కారణం తెలిస్తే షాక్!


తెలుగు రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో ప్రజలు ప్రతి ఏటా ఉపాధి కోసం అని సౌదీ అరేబియాకి వెళ్తూ ఉంటారు. అయితే అక్కడ వారు అడుగుపెట్టిన తర్వాత పడే పాట్లు ఎవ్వరికి తెలియవు. ఇప్పుడు మరల తెలుగు కార్మికులకి అక్కడ పెద్ద కష్టం వచ్చిపడింది. సౌదీ చట్టాల ప్రకారం అక్కడ కంపెనీలు విదేశీ కార్మికుల భారాన్ని తగ్గించుకున్నాయి. దీంతో ఒక్కసారిగా 14 శాతం కార్మికులు రోడ్డున పడ్డారు. సౌదీ కంట్రీస్ లో ఇంత కాలం పని చేస్తున్న 80 వేల మంది తెలుగు కార్మికులు రోడ్డున పడ్డట్లు సమాచారం.

అయితే ఆయా కంపెనీలు కార్మికులని విధుల నుంచి తొలగించిన వీసా, పాస్ పోర్ట్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నట్లు సమాచారం. గత మూడు నెలలుగా అక్కడ కార్మికులకి కంపెనీలు వేతనాలు ఇవ్వలేదు. అలాగే పాస్పోర్ట్ కూడా ఇవ్వకుండా రోడ్డున పడేయడంతో వారి ఆకలి కేకలు పెడుతున్నారు. వీరి నుంచి కుటుంబాలకి వీడియో మెసేజ్ లు పెడుతున్నట్లు సమాచారం. దీంతో అక్కడి కార్మికుల బాధలని ప్రభుత్వం వెంటనే ద్రుష్టి పెట్టి అక్కడి నుంచి తమ వారిని ఇండియాకి తీసుకురావాలని కార్మికుల కుటుంబ సభ్యులు మొర పెట్టుకుంటున్నారు.

Comments