నేడు తెలంగాణ టిడిపి నేతలతో బాబు భేటీ!

chandhra-babu2
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలతో భేటీ కానున్నారు. ఈ నేపధ్యంగా చంద్రబాబు త్వరలో జరగనున్న కంటోన్మెంట్ ఎన్నికలకు సంబంధించిన అంశాలపై ఆ పార్టీ ముఖ్యులతో చర్చించనున్నారు. కాగా సికింద్రాబాద్ పరిధిలోని కంటోన్మెంట్ లో గతంలో జరిగిన ఎన్నికలప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ మంచి ఫలితాలను సాధించింది.

ఇక ఈ నేపధ్యంగా ఈసారి ఎన్నికలలో కూడా మెరుగైన ఫలితాలను రాబట్టేందుకు పార్టీని బలోపేతం చేసే అంశాల వ్యూహరచనకై చంద్రబాబు టిటిడిపి సీనియర్ నేతలతో నేడు భేటీ కానున్నారు. కాగా కంటోన్మెంట్ లో తెలుగుగుదేశం పార్టీకి మంచి పట్టు ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతం తెలంగాణలో ఏర్పడిన నూతన రాజకీయ సమీకరణాల దృష్ట్యా మరింత పట్టు సంపాదించేందుకు తగిన వ్యూహంతో ముందుకు సాగాలని చంద్రబాబు యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది.

Comments