ప్రచురణ తేదీ : Dec 4, 2017 1:56 PM IST

విద్యుత్ ప్లాంట్‌తో న‌ల్ల‌మోతు ఇమేజ్ స్కైలోకి..!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ విభ‌జ‌న త‌ర్వాత తెలంగాణ ప్రాంతానికి విద్యుత్ ప‌ర‌మైన స‌మ‌స్య‌లు త‌లెత్తిన‌ సంగ‌తి తెలిసిందే. అయితే అలాంటి స‌వాల్‌ని సీఎం కేసీఆర్ ఎంతో స‌మ‌ర్ధంగా తీసుకుని, ప‌లు విద్యుత్ ప్రాజెక్టులు త‌ల‌పెట్టారు. అందులో మిర్యాల‌గూడ(న‌ల్గొండ‌) -యాదాద్రి ధ‌ర్మ‌ల్ ప్లాంట్ అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌క‌మైన‌ది. భారతదేశం లోనే మొట్ట మొదటిసారిగా అత్యధిక విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యం కలిగిన యాదాద్రి ధర్మల్ ప్లాంట్ ను 2015 సెప్టెంబర్ లో తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ మిర్యాల‌గూడ‌లో శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్ట్ కి 24,956 వేల కోట్ల నిధులు కేటాయించారు. ఆ నిధులు అన్నిరకాల అనుమతులతో సహా ఎలాంటి ఆటంకాల్లేకుండా విడుదల అయ్యాయి. నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గం దామచర్ల మండలంలోని వీర్లపాలెం గ్రామంలో ఈ ప్రాజెక్టును చేప‌ట్ట‌డంతో ఆ ప్రాంతవాసుల్లో హ‌ర్షాతిరేకాలు వ్య‌క్తం అవుతున్నాయి.

అయితే ఇలాంటి బృహ‌త్త‌ర ప్రాజెక్టును ప్రారంభించేప్పుడు భూముల ప‌ర‌మైన స‌మ‌స్య త‌లెత్తుతుంద‌న్న‌ది తెలిసిందే. అలాంటి స‌మ‌స్య రాకుండా నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల్ని స‌మాయ‌త్తం చేయ‌డంలో ఆ ప్రాంత ఎమ్మెల్యే న‌ల్లమోతు భాస్క‌ర‌రావు ఘ‌న‌విజ‌యం సాధించారు. ఆయ‌న చొర‌వ‌తో గ్రామాల్లోని ప్ర‌జ‌లంతా ప్రాజెక్టుకు ఇతోధికంగా స‌హ‌క‌రించారు. భారీగా భూములిచ్చి సాయం చేశారు. ఈ సంద‌ర్భంగా ధర్మల్ ప్లాంట్ కి భూములు ఇచ్చిన పేద ప్రజలకు ఎంఎల్ఏ నల్లమోతు భాస్కర్ రావు పూర్తిగా పరిహారం చెల్లించేలా చ‌ర్య‌లు చేప‌ట్టారు. దీనిపై మిర్యాలగూడ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రాంత అభివృద్ధి కి తమ ఏం.ఏల్.ఏ భాస్కర్ రావు ఏంత గానో కృషి చేస్తున్నారని కొనియాడుతున్నారు. మిర్యాలగూడ నియోజకవర్గం ను రాష్ట్రం లోనే అత్యంత అభివృద్ధి కలిగిన ప్రాంతంగా తీర్చి దిద్ధ‌డ‌మే నా ధ్యేయం. అందుకు మా పార్టీ క్యాడ‌ర్ ఇతోధికంగా కృషి చేస్తోంద‌ని ఎమ్మెల్యే తెలిపారు. ఇప్పటివరకు ఇతర రాష్ట్రాల నుండి విద్యుత్తు కొనుగోలు చేసిన తెలంగాణ‌ ఈ ప్రాజెక్ట్ సెట్ అయితే వేరే రాష్టాలకు విద్యుత్తును సరపరా చేసే స్థాయి కి ఏదుగుతుంద‌ని న‌ల్ల‌మోతు ఈ సంద‌ర్భంగా గుర్తు చేసారు, పారిశ్రామిక మరియు వ్యవసాయ రంగానికి నిరంతర విద్యుత్తు సరపరా చేయొచ్చ‌ని, ఇది అభివృద్ధికి సూచిక‌ అని ఆయన హ‌ర్షం వ్య‌క్తం చేశారు. కాగా, ఈ యదాద్రి ధర్మల్ ప్లాంట్ ని బిహెచ్ఇఎల్‌, జెన్కో సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ఐదు ప్లాంటులతో నెలకోల్పుతున్న ఈ విద్యుత్తు కేంద్రం నుండి ఒక్కో యూనిట్ నుంచి 800 మెగావాట్లు విద్యుత్తు ఉత్పత్తి చేసే అవకాశం ఉందని, మొత్తంగా 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్ప‌త్తి చేయ‌డ‌మే ల‌క్ష్య‌మ‌ని ఎమ్మెల్యే తెలిపారు. నీటి పారుదల ప్రాజెక్ట్ లకు విద్యుత్తు సరపరా చేయ‌డం,. పారిశ్రామిక రంగానికి నిరంతర విద్యుత్తు అందించ‌డం, వ్యవసాయ రంగానికి 24 గంటల విద్యుత్తు అందించ‌డం, భవిష్యత్తు తరాలకు కూడా సరిపడా విద్యుత్తు నిల్వలు సాధించ‌డం ధ్యేయంగా ఈ ప్రాజెక్టును ముఖ్య‌మంత్రి ప్లాన్ చేశార‌ని న‌ల్ల‌మోతు తెలిపారు.. మిర్యాలగూడ నియోజకవర్గం పరిధి లో నిరుద్యోగ సమస్య లేకుండా చేయటం, నియోజకవర్గాన్ని రాష్ట్రం లోనే నంబ‌ర్ వ‌న్‌గా తీర్చి దిద్దటం త‌మ ల‌క్ష్య‌మ‌ని వెల్ల‌డించారు. ఈ విద్యుత్ ప్లాంట్ నియోజ‌క‌వ‌ర్గంలో న‌ల్ల‌మోతు భాస్క‌ర‌రావు ఇమేజ్ పెంచింద‌న్న టాక్ న‌డుస్తోంది.

Comments