ప్రచురణ తేదీ : Sat, Aug 12th, 2017

కేసీఆర్ సిఎం రేసు నుంచి తప్పించేందుకు పెద్ద కుట్ర? ఎందుకు అలా చేస్తున్నారు!


ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో రాజకియ నాయకులు వచ్చే ఎలక్షన్స్ బ్యాక్ గ్రౌండ్ బాగానే చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో అయితే అధికార పక్షానికి ప్రతి పక్షానికి గట్టు స్థాయిలో పోటీ జరగనున్న విషయం తెలిసిందే, ముఖ్యంగా అక్కడ వైసిపి కొత్త ఆలోచనలతో విమర్శలనే ఆయుధంగా చేసుకొని అధికార పక్షం నేతలను టార్గెట్ చేసింది. ప్రస్తుతం నంద్యాల ఎలక్షన్స్ కోసం ఏ స్థాయిలో పోరాడుతున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 2019 ఎలక్షన్స్ కి ఇదొక సెమి ఫైనల్ లాంటిదే అని చెప్పాలి. ఇక టిడిపి కూడా అధికార పక్షానికి సరైన సమాధానాన్ని చెప్పాలని ఆలోచిస్తోంది.

అయితే తెలంగాణాలో మాత్రం అందుకు పూర్తి బిన్నంగా ఉంది. 219 ఎలక్షన్స్ లో అసలు కేసీఆర్ కి పోటీ ఉందా అనే విష్యం కూడా ఎవ్వరు కరెక్ట్ గా చెప్పలేకపోతున్నారు. ఇక టీఆరెస్ పార్టీ కూడా రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంపై కన్నేసింది. అయితే కేసీఆర్ ని ఈ సారి ఎలక్షన్స్ లో ఎదుర్కోవాలంటే.. ఓ ఉపాయం ఉందని కొందరు నేతలు అంటున్నారు. ప్రతిపక్షాలన్నీ కలిసి చేతులు కలిపితే తప్ప కేసీఆర్ ని ఎదుర్కోలేరని చెబుతున్నారు. మరి తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు వామపక్షాలతో చేతులు కలుపుతాయా అనేది అనుమానంగానే ఉంది,. ఒకవేళ కలిపినా కేసీఆర్ కి ఏ స్థాయిలో పోటీ ఇస్తారనేది కూడా అంచనా వేయలేకపోతున్నారు రాజకీయ విశ్లేషకులు. కానీ గట్టు పోటీ మాత్రం జరగనుందని చెబుతున్నారు.

Comments