ఇవాంక ట్రంప్ కోసం హైదరాబాద్ లో ఖర్చు..జస్ట్ 100 కోట్లే..!

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంక ట్రంప్ ఈ నెల 28 న హైదరాబాద్ లో జరగనున్న గ్లోబల్ సమ్మిట్ కు హాజరు కానున్నారు. అగ్రరాజ్యం అధినేత కుమార్తె హైదరాబాద్ లో అడుగు పెటుతుండడంతో నగరాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నారు. హైదరాబాద్ నగర పాలక సంస్థ జిహెచ్ఎంసి ఎన్నడూ లేని విధంగా ఇవాంక బస చేయబోయే పాత బస్తి, మరియు హెటెక్ సిటీలోని పలు ప్రాంతాలలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. పెండింగ్ లో ఉన్న రోడ్ల నిర్మాణం, డ్రైనేజి మరమ్మతులు, గార్డెనింగ్ తదితర అన్ని పనులని జిహెచ్ఎంసి ఒకేసారి చేపడుతోంది.

ఇవాంక పాల్గొనబోయే గోబర్ సమ్మిట్ తో కలిపి మొత్తం రూ 100 కోట్లని ప్రభుత్వం ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇవాంక తిరిగే రోడ్డు మార్గాల్లో చెట్లకు, ఫుట్ పాత్ లకు రంగులు వేస్తున్నారు. చార్మినార్ చుట్టూ పక్కల ప్రాంతాలని ముస్తాబు చేస్తున్నారు. మహిళా పర్యాటకుల కోసం షీ టాయిలెట్స్ ని ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. నగర మేయర్ బొంతు రామ్మోహన్ అన్ని పనులని పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే నగరంలోని బిచ్చగాళ్లకు పునరావాస కేంద్రాలని కూడా ఏర్పాటు చేయడం విశేషం.

Comments