ప్రచురణ తేదీ : Nov 24, 2016 8:35 AM IST

రూ 50 కోట్ల ఇంటిలోకి ఘనంగా అడుగు పెట్టిన కేసీఆర్

kcr-home
తెలంగాణా ముఖ్యంమత్రి కేసీఆర్ అధికారిక నివాసం లోకి గురువారం ఉదయం గృహ ప్రవేశం చేశారు. గురువారం ఉదయం 5:22 గంటల;ఆకూ గృహప్రవేశం చేశారు. ఘనం గా జరిగిన గృహ ప్రవేశానికి పలువురు ప్రముఖులతో పాటు చినజీయర్ స్వామి కూడా హాజరుకావడం విశేషం. తొమ్మిది ఎకరాల విస్తీరణం లో రూ 50 కోట్ల ఖర్చుతో కేసీఆర్ అధికారిక నివాసం నిర్మితం కావడం విశేషం. గృహప్రవేశాన్ని వేదం పండితులు శాస్రోక్తం గా నిర్వహించారు.

కాగా ఈ నివాసానికి ‘ప్రగతి భవన్’ గా నామకరణం చేశారు. సీఎం నివాసం వద్దే క్యాంపుకార్యాలయం, సమావేశ మందిరాలని నిర్మించారు. దాదాపు రూ 50 కోట్ల భారీ ఖర్చుతో నిర్మించిన ఈ భవనాలపై ప్రతిపక్షాలనుంచి విమర్శలు కూడా ఉన్నాయి. దాదాపు మూడు వందల కార్లకు పార్కింగ్ సదుపాయం ఉండేలా ఈ నిర్మాణం జరిగింది. ఇందులోనే బుల్లెట్ ఫ్రూఫ్ బాత్ రూమ్ లను కూడా నిర్మించినట్లు తెలుస్తోంది.

Comments