ప్రచురణ తేదీ : Thu, Aug 10th, 2017

ప్రశాంత్ కిషోర్ చెత్త ఐడియాలకి ఫుల్ స్టాప్? అడ్డంగా దొరికేసాడు!

ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో బలంగా వినిపిస్తున్న రాజకీయేతర పేరు ప్రశాంత్ కిషోర్. వ్యూహకర్తగా దేశంలో ఇంతనికి మంచి పేరు ఉంది, రాజకీయ విశ్లేషణలు చేయడంలో ఇప్పుడున్న అతి కొద్ది మంది మేధావుల్లో ప్రశాంత్ కూడా ఒకరని గుర్తింపు తెచ్చుకున్నారు. అందులో భాగంగానే ఇప్పుడ వైసీపీ ఎన్నికల వ్యూహకర్త గా, రాజకీయ విశ్లేషకుడుగా ఉన్నాడు. జగన్ అతన్ని ఏరికోరి పిలిపించుకున్నాడు. అయితే ఇక్కడికి అడుగుపెట్టిన తర్వాత ప్రశాంత్ కిషోర్ తన టీంతో కలిసి ఆంధ్రా రాజకీయాలని విశ్లేషించే పనిలో పడ్డాడు. పనిలో పనిగా వైసీపీని గెలిపించే ప్రయత్నాలు మొదలుపెట్టాడు. దాని కోసం తన వ్యూహాలని బయటకి తీస్తూ అందరి ద్రుష్టి తన మీద పడే విధంగా చేయాలనీ ప్రయాణిస్తున్నాడు.
అయితే ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహానికి పదును పెట్టి టీడీపీని ఇరికించడానికి తన ఆలోచనలని బయటకి తీసి. అందుకోసం సోషల్ మీడియాని ఉపయోగించుకుంటున్నాడు. అసలు సమస్య ఇక్కడే వచ్చింది. ఒక పార్టీ మీదగాని, వ్యక్తుల మీద గాని, వర్గం, కులం, మతం, ప్రాంతం మీద వ్యక్తిగత దూషణలకి వెళ్ళడం, అలాంటి ప్రచారం చేయడం చట్టరీత్య నేరం, ఎన్నికల వేళ ఒకరిని ఒకరు ఎలా విమర్శించుకున్న పర్వాలేదు. కాని ఇలా సోషల్ మీడియా ఉపయోగించుకొని ప్రచారం చేయడం మాత్రం తప్పు. ప్రశాంత్ కిషోర్ సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్స్ ఓపెన్ చేసి వాటి ద్వారా పేస్ బుక్, ట్విట్టర్ లో టీడీపీ మీద నెగిటివ్ పబ్లిసిటీ చేస్తున్నాడని టీడీపీ గుర్తించింది. దీంతో అతని మీద చట్టపరంగా యాక్షన్ తీసుకోవాలని ఆలోచనలో ఉన్నట్లు ఉంది. రాజకీయ వ్యూహకర్త అంటే పార్టీ బలాబలాలు గుర్తించి, అలాగే అపోజిట్ పార్టీ వీక్ నేస్ ఏంటో తెలుసుకొని పార్టీ గెలుపు కోసం సలహాలు ఇవ్వాలి. కాని ఇలా తానె దగ్గరుండి అనవసరమైన విష ప్రచారం చేయడం కరెక్ట్ కాదని రాజకీయ విశ్లేషకుల మాట. మరి ప్రశాంత్ కిషోర్ వ్యవహారం ఎలాంటి మలుపులు తీసుకుంటుందో చూడాలి.

Comments