ఆమరణ దీక్షకు సిద్దమైన టీడీపీ నాయకుడు

ఎలక్షన్స్ దగ్గర పడుతుండడంతో రాజకీయ నాయకులు ఎవరి స్టైల్ లో వాళ్లు ప్రజలను ఆకర్షించే విధంగా ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం తెలుగు దేశం పార్టీ లో అందరూ నేతలు వారి సామర్ధ్యాన్ని నీరుపించుకునేందుకు సిద్ధమవుతున్నారు. అయితే అందరికంటే డిఫెరెంట్ గా తెలుగు దేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ చెప్పినట్టుగానే ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమయ్యారు. కడప జిల్లాలో వీలైనంత త్వరగా ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలని గత కొన్ని నెలలుగా ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్న సంగతి తెలిసిందే.

కేంద్రంకు ఇటీవల ఆయన లేఖ కూడా పంపారు. ఇక ఫైనల్ గా పరిశ్రమ కోసం సీఎం రమేష్ ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమయ్యారు. ఉక్కు దీక్ష అని పేరు పెట్టిన టీడీపీ నాయకులూ దీక్ష కోసం అన్ని ఏర్పాట్లను చేశారు. రాష్ట్రం విభజన చట్టంలో ఉన్నందున ఇటీవల కేంద్రం ఉక్కు పరిశ్రమలను ఏర్పాటు చేయడం కుదరదని సుప్రీం కోర్టులో ఓ అఫిడవిట్‌ ను సమర్పించారు. దీంతో ఇరు రాష్ట్రాల్లో ఆగ్రహ జ్వాలలు నెలకొన్నాయి. సీఎం రమేష్ మోడీకి రాసిన లేఖలో కడపతో పాటు బయ్యారంలో ఉక్కు పరిశ్రమలను ఏర్పాటు చేయాలనీ డిమాండ్ చేశారు. సరైన సమాధానం వచ్చే వరకు నిరాహారదీక్ష కు బ్రేక్ ఉండదని వైసిపి నేతల మాదిరిగా దొంగ దీక్షకు కూర్చొనని కూడా అయన తెలిపారు.

Comments