ప్రచురణ తేదీ : Wed, Aug 9th, 2017

తలకాయలు పుచ్చకాయల్లా పగిలాయి..ఈ కాంగ్రెస్సోళ్లు మారరా..?

యథా రాజా.. తధా ప్రజా అనే సామెత ఇందుకే పుట్టిందేమో. పాలించే ప్రభువు ఎలా ఉంటే ప్రజలు అలానే ఉంటారని టి కాంగ్రెస్ నేతలు నిరూపించారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఓ విషయం స్పష్టంగా కనిపిస్తోంది. అదే క్రమశిక్షణా రాహిత్యం. కాంగ్రెస్ పార్టీలో అగ్రపీఠం కోసం లోలోపలే కుమ్ములాటలు జరుగుతున్నాయి. ఉత్తమ్, జానా రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరియు డీకే అరుణ మధ్య క్యాంపు రాజకీయాలు నడుస్తున్నాయి. అగ్ర నేతలే అలా ఉంటె ఇక కిందిస్థాయి నేతల మధ్య గొడవలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

భువనగిరి లో జరిగిన పార్టీ సమావేశంలో జిల్లా స్థాయి నేతలంతా పాల్గొన్నారు. ఎంఐదో ఏమో తెలియదు కానీ ఒక్కసారిగా వారి మధ్య గొడవ పెరిగి తలలు పగలగొట్టుకునే వరకూ వ్యవహారం వెళ్ళింది.దేవరకొండకు చెందిన కాంగ్రెస్ ఎస్టీ సెల్ ప్రెసిండెంట్ జగన్నాథ్ నాయక్, మాజీ జడ్పిటిసి సభ్యురాలి భర్త నారాయణ మధ్య ఘర్షణ జరిగింది. వారి మధ్య తీవ్రమైన గొడవ జరగడంతో ఇద్దరి తలలు పగిలి రక్తం కారే వరకు పరిస్థితి వెళ్ళింది. గాయాల పాలైన వారిద్దరిని అక్కడున్న నేతలు వెంటనే ఆసుపత్రికి తరలించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లు రవి సమావేశంలో ఉండగానే ఈ తంతు జరిగింది.

Comments