ప్రచురణ తేదీ : Jan 11, 2018 2:35 AM IST

చాలా రోజుల తరువాత కెప్టెన్ గా ధోని.. టీమ్ రెడీ!

సమ్మర్ వస్తే చాలు క్రికెట్ అభిమానులకు ఐపీఎల్ హంగామా మొదలైనట్లే. ప్రతి ఏడాది ఐపీఎల్ చాలా హిట్ అవుతోంది. ఈ సారి కూడా టీ20 అసలైన మజా భారీ స్థాయిలో ఉండనుందని తెలుస్తోంది. ఫిక్సింగ్ ఆరోపణలను ఎదుర్కొని ఐపీఎల్ కు దూరమైన చెన్నై సూపర్ కింగ్స్ ఈ సారి స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనుంది. అంతే కాకుండా మళ్లీ మహేంద్ర సింగ్ ధోని నాయకుడిగా కనిపించబోతున్నాడు. చెన్నై జట్టుకి కెప్టెన్ గా ఉన్న ధోని రెండు సార్లు ట్రోపిని అందించి నాలుగు సార్లు ఫైనల్ కి తీసుకొచ్చాడు. అయితే ఈ సారి కూడా అదే తరహాలో జట్టును నడిపించలని చూస్తున్నాడు. ఇకపోతే యాజమాన్యం అప్పుడు ఉన్న ఆటగాళ్లనే ఇప్పుడు కూడా ఉండేలా జాగ్రత్తలు తీసుకొంటోంది. ముఖ్యంగా సురేష్ రైనాను వదులు కోవడానికి యాజమాన్యం ఇష్టపడటం లేదు. ధోనికి రైనా తోడైతే మ్యాచ్ ఈజీగా వారివైపు తిరుగుతుంది. ఇక మరో ఆయుధాలు జడేజా, అశ్విన్ కూడా ధోని తోనే కలవనున్నారు. ఈ విషయాన్ని ఇటీవల రైనా మీడియా ద్వారా తెలిపాడు. అంతే కాకుండా ధోనికి కెప్టెన్ అని తానూ వైస్ కెప్టెన్ గా బాధ్యతలను తీసుకుంటున్నట్లు రైనా తెలిపాడు.

Comments