జయ ఆస్తులు ఎంతమేర మాయం కానున్నాయి..?


జయలలిత అక్రమాస్తుల కేసులో ఆమె నెచ్చెలి శశికళకు సుప్రీం కోర్టు నాలుగేళ్ళ జైలు శిక్ష విధించింది. ఈ కేసులో జయలలితని కూడా సుప్రీం దోషిగా తేల్చింది. కానీ ఇపుడు జయ లేరు. దీనితో సుప్రీం కోర్టు జయలిత ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి ఆదేశాలు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది.1996 లోనే జయ 66 కోట్ల అక్రమ ఆస్తులు కూడబెట్టారని కేసు నమోదైంది.

కాగా సుప్రీం జయకు చెందిన ఎంతవిలువైన ఆస్తులను స్వాధీనం చేసుకుంటుంది అనే అంశం ఆసక్తిగా మారింది. అందుతున్న సమాచరం ప్రకారం జయకు చెందిన వివిధ 250 ఆస్తులను స్వాధీనం చేసుకోనున్నారు.త్వరలో ఆమె ఆస్తులపై దాడులు జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ కేసు విషయం లో జయలలిత కొన్ని రోజులు జైలు జీవితం కూడా గడిపిన విషయం తెలిసిందే.అక్రమాస్తులకేసులో జయలలిత ఏ 1 ముద్దాయి కాగా, శశికళ ఏ 2 ముద్దాయిగా ఉన్నారు.1996 అప్పటి జనతాపార్టీ అధ్యక్షుడు, ప్రస్తుతం బిజెపి నేత గా ఉన్న సుబ్రమణ్య స్వామీ ఈ కేసు దాఖలు చేశారు. జయకు చెందిన పలు వ్యాపార సంస్థలను శశికళ చూసుకునేవారు.

Comments