ప్రచురణ తేదీ : Sep 19, 2016 4:17 PM IST

పవన్ ను కలిసేందుకు ఉవ్విళ్లూరుతున్న సుజనా.. రాజీకోసమేనా..?

sujana-chowdary
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలిసేందుకు సుజనా చౌదరి ఆరాటపడుతున్నట్లు తెలుస్తోంది. ప్యాకేజ్ వల్ల వచ్చే ప్రయోజనాలు తెలిస్తే పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా సంతోషపడతారని సుజనా తెలిపారు. దానికోసం తాము పవన్ కళ్యాణ్ ను కలిసి ప్రత్యేక ప్యాకేజ్ వలన వచ్చే ఉపయోగాలను ఆయనకు వివరిస్తామని తెలిపారు.

హోదా అన్న పేరు మాత్రమే లేదని, అంతకు మించిన ప్రయోజనాలు ప్యాకేజ్ వలన వచ్చాయని విడమరచి చెబితే పవన్ అర్థం చేసుకుంటారన్న నమ్మకం ఉందని సుజనా చౌదరి వ్యాఖ్యానించారు. ఆ పనిని తానె స్వయంగా చేస్తానని అన్నారు.ప్యాకేజ్ లో ఉన్న ప్రతిఫలాన్ని గమనించిన వారెవరూ దీనిని కాదని అనరని అన్నారు. జాతీయ ప్రాజెక్ట్ కు వందశాతం నిధులు ఇస్తామని చెప్పడం ఇంతవరకు స్వతంత్ర భారత దేశం లో జరగలేదని అన్నారు. అది కేవలం ఇక్క పోలవరం విషయం లోనే అలా జరిగిందని అన్నారు.కాగా పవన్ ను సుజనా చౌదరి కలుస్తానని చెప్పడం వెనుక రాజకీయ ఆంతర్యం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రత్యేక హోదా ను కేంద్రం నుంచి సాధించుకోలేక పోయిన టిడిపి పై పవన్ అలిగి ఉన్న సంగతి తెలిసిందే. ఈ సమయం లో వామ పక్షాలు పవన్ కు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యం సుజన్ చౌదరి పవన్ ను శాంతింపజేయడానికి ప్రయత్నిస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు.

Comments