ప్రచురణ తేదీ : Sep 29, 2018 10:46 AM IST

కౌశల్ ని ఇంకా టార్గెట్ చేస్తున్నారు.!తేజస్వి ఇక మారదా?

బుల్లి తెరపై బిగ్ బాస్ షో ఒక సంచలనమే అని అందరికి తెలుసు.గత కొన్ని నెలల క్రితం నాని హోస్టింగ్ తో మొదలయ్యిన ఈ రెండో సీసన్ ఇప్పుడు ఒక కొలిక్కి రాబోతుంది.16 మందితో మొదలయ్యిన ఈ సీసన్ మొత్తం 5 మందితో అంతిమ దశకు చేరుకుంది.బిగ్ బాస్ ఇంట్లో మొదటి నుంచి అందరు కౌశల్ ని కావాలనే టార్గెట్ చేస్తున్నారు అన్నది కౌశల్ అభిమానుల వాదన,కొన్ని కొన్ని సందర్భాల్లో ఆ విషయం నిజమేనేమో అని కూడా అనిపిస్తుంది.ఇదిలా ఉండగా ఇప్పుడు బిగ్ బాస్ మిగిలిన హౌస్ మేట్స్ కి ముందు ఎలిమినేట్ అయినటువంటి సభ్యులు అందరిని పిలిపించి ఒక సర్ప్రైజ్ ఇచ్చారు.

కానీ ఆ సర్ప్రైజ్ ఒక్కరికి తప్ప అందరికి దక్కింది.మళ్ళీ తిరిగి వచ్చిన సభ్యలు అందరు మళ్ళీ కౌశల్ నే టార్గెట్ చేసినట్టుగా తెలుస్తుంది,వారిలో వారే మళ్ళీ గ్రూపులుగా విడిపోయి కౌశల్ ని ఒంటరి చేసేసారు,తేజస్వి ఐతే మరీను వచ్చి అందరిని పలకరించింది కానీ,ఒక్క కౌశల్ ని మాత్రం పట్టించుకోలేదు,బాబు గోగినేని పరిస్థితి కూడా ఇంతే వారు ఏ విధంగా ఐతే బయటికి వెళ్లారో అదే విధంగా లోపలికి వచ్చారని,వాళ్ళు ఇక మారరని కౌశల్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.నిన్నటి ఎపిసోడ్ ప్రోమో చూసుకున్నా సరే కౌశల్ ని ఒక్కరు కూడా కనీసం పలకరించిన పాపాన పోలేదు,సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.కానీ కౌశల్ కి తాము ఎప్పుడు వెన్నంటే ఉంటామని కౌశల్ ఆర్మీ అంటున్నారు.

Comments