2 గంటల పాటు 100 అడుగుల ఎత్తులో తలక్రిందులుగా వేలాడిన జనం

పశ్చిమ జపాన్‌లోని యూనివర్శల్ స్టూడియోస్ ఎమ్యూజ్‌మెంట్ పార్కులోగల ఒక రోలర్ కోస్టర్ ఉన్నట్టుండి ఆగిపోవడంతో అకస్మాత్తుగా అనుకోని ఘటన చోటుచేసుకుంది. రోలర్ కోస్టర్‌లో కొన్ని టెక్నికల్ సమస్యలు సంభవించడం వల్ల అందులో విహరిస్తున్న సుమారు 64 మంది 2 గంటలపాటు దానిని అంటిపెట్టుకుని తలక్రిందులుగా వేలాడుతూ ఊపిరి బిగపట్టుకొని ఉండిపోయారు. మీడియాకు అందిన సమచారం ప్రకారం ఎమర్జెన్సీ స్టాప్ కారణంగా 100 అడుగుల ఎత్తులో వీరంతా చిక్కుకుపోయి బిక్కు బిక్కుమంటూ ఎప్పుడు కాపాడుతారా ఎప్పుడు సేఫ్ గా కిందకి వెళతామా అంటూ భయంతో కిక్కురుమనకుండా కూర్చున్నారు. కాగా వీరిని పార్కు సిబ్బంది ఎమర్జెన్సీ మార్గంలో బయటకుతీసువచ్చారు. ఈ ఘటనలో ఎవరికీ ప్రమాదం జరగలేదని తెలుస్తోంది. కాగా ఈ పార్కులో గతంలో కూడా ఇటువంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. 1120 మీటర్ల పొడవైన ఈ రోలర్ కోస్టర్‌ను 2016 మార్చిలో ప్రారంభించారు. మరి వీళ్ళు ఆ ప్రమాదం నుంచి ఎలా తప్పించుకు బయట పడ్డారో ఈ వీడియోలో మీరూ ఒక్కసారి చూసేయండి

Comments