ప్రచురణ తేదీ : Dec 4, 2017 4:00 PM IST

శ్రీలంక క్రికెటర్లపై కామెంట్స్.. వాంతులు చేసుకున్న ఆటగాళ్లు


ప్రస్తుతం ఢిల్లీలో నెలకొన్న వాతావరణ పరిస్థితులు చాలా బయంకరంగా ఉన్నాయి. ఢిల్లీలో జరుగుతోన్న శ్రీలంక – ఇండియా టెస్ట్ మ్యాచ్ లో విదేశీ ఆటగాళ్లు ఆ వాతావరణంతో చాలా ఇబ్బందిపడుతున్నారు. మ్యాచ్ మొదటి రోజు నుంచి ఆటగాళ్లు అభ్యంతరాలు తెలుపుతూనే ఉన్నారు. పలుమార్లు అంపైర్లకు వారి బాధను వివరించారు. రెండు మూడు సార్లు మ్యాచ్ కు అంతరాయం కూడా కలిగింది. దీంతో కోహ్లీ నిన్న ఇన్నింగ్స్ ని కోపంతో డిక్లేర్ చేశారు. అయితే శ్రీలంక ఆటగాళ్లు కావాలని ఇలా చేస్తున్నట్లు పలువురు వ్యాఖ్యానించారు. అయితే ఆ తరహా వ్యాఖ్యలను శ్రీలంక జట్టు కోచ్ నిక్‌ పోఠాస్ వివరణ ఇచ్చాడు.. త‌మ‌ క్రికెటర్లు కావాలని హైడ్రామా క్రియేట్‌ చేస్తున్నారని వస్తున్న కామెంట్స్ లో ఏ మాత్రం నిజం లేదని చెప్పారు. వాతావరణం సహకరించక సురంగ లక్మల్‌, లాహిరు గమగె, ధనంజయ డిసిల్వా డ్రెస్సింగ్ రూమ్‌కి వ‌చ్చి వాంతులు కూడా చేసుకున్నారనితెలిపారు.

Comments