ప్రచురణ తేదీ : Wed, Jan 11th, 2017

చంద్రబాబు ప్రోటోకాల్ ఫాలో కావాలి అంటున్న ఎమ్మెల్యే..!

srikanth-reddy
వైసిపి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు పై తీవ్ర స్థాయిలో విమర్శలతో విరుచుకుపడ్డారు. ప్రోటోకాల్ పాటించకుండా వైసిపి నేతలను అవమానిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజశేఖర్ రెడ్డి చేపట్టిన ప్రాజెక్ట్ లనే ఇప్పుడు చంద్రబాబు ప్రారంభించి పబ్లిసిటీ చేసుకుంటున్నారని ఆయన ధ్వజమెత్తారు.గతంలో చంద్రబాబు 2004 వరకు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నారని కానీ ఆ సమయంలో చంద్రబాబు రాయల సీమలో ఒక్క సాగునీటి ప్రాజెక్ట్ కూడా ప్రారంభించ లేదని ఆ తరువాత రాజశేఖర్ రెడ్డి చేపట్టిన ప్రాజెక్ట్ లనే ఇప్పుడు చంద్రబాబు పబ్లిసిటీ చేసుకుంటున్నారని అన్నారు.

కాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు పులివెందులలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పైడిపాల పథకాన్ని ప్రారంభించిన చంద్రబాబు పులివెందుల కెనాల్ బ్రాంచికి నీటిని విడుదల చేశారు. ఈ నేపథ్యం లోనే శ్రీకాంత్ రెడ్డి చంద్రబాబు పై విమర్శలు గుప్పించారు.రాయల సీమలో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి అనేక ప్రాజెక్టులను చేపట్టారని, తెలుగు గంగ ప్రాజెక్ట్ కూడా రాజశేఖర్ రెడ్డి పూర్తి చేసిన విషయాన్ని శ్రీకాంత్ రెడ్డి గుర్తు చేసుకున్నారు.

Comments