ప్రచురణ తేదీ : Apr 11, 2018 7:11 PM IST

శ్రీరెడ్డి లీక్స్‌ : చాన‌ల్‌లో అవకాశం కావాలంటే.. TV చాన‌ల్ అధినేత చీకటి కోణం లీక్‌..!

తెలుగు చిత్ర సీమలో వ‌రుస లీకుల‌తో తెలుగు రాష్ట్రాలని చిటపటలాదిస్తున్న శ్రీరెడ్డి.. ఇప్ప‌టికే పలువురు సెల‌బ్ర‌టీల పై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేస్తూ సంచ‌ల‌నం రేపుతున్న సంగ‌తి తెలిసిందే. ఇక తెలుగు పరిశ్రమలోని ప్రముఖ నిర్మాత సురేష్ బాబు తనయుడు అభిరామ్‌ తనకు అవకాశాలు కల్పిస్తానని చెప్పి అనుభవించాడని ఆ తర్వాత అవకాశాలు మాత్రం ఇవ్వలేదని నటి శ్రీరెడ్డి సంచలన ఆరోపణలు చేయ‌డ‌మే కాకుండా అభిరామ్‌తో దిగిన ఫోటోల‌ను లీక్ చేసింది.

ఇక ఆత‌ర్వాత టాలీవుడ్‌లో ఫ్యామిలీ చిత్రాల నిర్మాత దిల్ రాజు పై త‌న ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టి మ‌రో బాంబు పేల్చంది శ్రీరెడ్డి.. దిల్ రాజు గారు మీరు టాలీవుడ్‌ను వ‌దిలేస్తే.. తెలుగు కాళామ‌త‌ల్లికి ప‌ట్టిన ద‌రిద్రం,శ‌ని వ‌దిలిపోతుంద‌ని.. మీవ‌ల్ల చాలామంది ఆడ‌పిల్ల‌ల జీవితాలు నాశ‌నం అవుతున్నాయిని.. ఇండ‌స్ట్రీలో మీ కుల రాజ‌కీయాలు ఎక్కువ‌య్యాయ‌ని.. ఆడ‌దాని శ‌రీరం మీకు వ్యాపారం అయిపోయింద‌ని.. సంచ‌ల‌న పోస్టు పెట్టింది. దీంతో సినీ వ‌ర్గాల్లో మ‌రోసారి హాట్ టాపిక్ అయ్యింది.

అయితే శ్రీ రెడ్డి ఇచ్చిన ఈ షాకుల నుండే జ‌నాలు బ‌య‌ట‌కి రాకుండానే మ‌రో అనుబాంబు పేల్చింది శ్రీరెడ్డి.. అయితే ఈసారి మీడియాని టార్గెట్ చేసింది శ్రీరెడ్డి. ఇప్ట‌టి వ‌ర‌కు సినీ ప్ర‌ముఖులు రాసలీల‌లు బ‌య‌ట పెట్టిన శ్రీ రెడ్డి.. ఈసారి ప్ర‌ముఖ తెలుగు న్యూస్ చాన‌ల్ సీఈఓతో చేసిన వాట్స‌ప్ చాటింగ్‌ను త‌న ఫేస్‌బుక్‌లో పోస్టు చేసింది. ఇక ఆ చాటింగ్ ఒక‌సారి మ‌నం గ‌మ‌నిస్తే.. టీవీ చానెల్లో అవ‌కాశం కోసం శ్రీరెడ్డి రిక్వెస్ట్ చేయ‌గా.. త‌న‌ను గెస్ట్‌హౌస్‌కి ర‌మ్మన్నాడు ఆ చానల్ సీఈఓ లేదు స‌ర్ నేను ఆఫీస్‌కు వ‌స్తాన‌ని శ్రీరెడ్డి చెప్పిగా.. అవ‌కాశం కావాలంటే గెస్ట్‌హౌస్‌కి రా లేక‌పోతే లేదని సీఈఓ చెప్పడం ఆ చాటింగ్‌లో ఉంది. ఇక ఈ ఇప్పుడీ మ్యాట‌ర్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నా ఇందులో నిజ‌నిజాలేంటో తెలియాల్సిఉంది.

Comments