ప్రచురణ తేదీ : Dec 5, 2017 5:05 PM IST

భారత్ కు రావాలని ఫ్లైట్ ఎక్కిన లంక వన్డే టీమ్..ఊహించని షాక్..!

ఢిల్లీ ఫిరోజ్ షా కోట్లా మైదానంలో భారత్, శ్రీలంక మధ్య మూడో టెస్ట్ జరుగుతోంది. భారత జట్టు అన్ని విభాగాల్లోనూ శ్రీలంకపై ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. రేపటితో టెస్టు సిరీస్ ముగియనుంది. డిసెంబర్ 10 నుంచి శ్రీలంక, ఇండియా మధ్య వన్డే సిరిస్ ప్రారంభం అవుతుంది. ఈ నేపథ్యంలో లంక వన్డే జట్టు సోమవారం రాత్రి ఇండియాకు బయలుదేరింది. గత రాత్రి లంక జట్టు కొలంబో విమానాశ్రయానికి చేరుకుంది. లంక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ సచిత్ పథరానా అయితే ఫ్లైట్ కూడా ఎక్కేసి రెడీగా ఉన్నాడు. మిగిలిన ఆటగాళ్లు కూడా విమానాశ్రయానికి చేరుకుంటున్నారు.

అంతలోనే ఊహించని పరిమాణం ఎదురైంది. భారత్ వెళ్లేందుకు క్రీడల మంత్రిత్వ శాఖ అనుమతి ఇవ్వలేదని ఆదేశాలు రావడంతో బయలుదేరిన ఆటగాళ్లంతా ఇంటి ముఖం పట్టారు. శ్రీలంక నిబంధనలు ప్రకారం విదేశాల్లో పర్యటించాల్సి ఆటగాళ్ల వివరాలని క్రీడల మంత్రికి పంపాలి, కానీ శ్రీలంక క్రికెట్ బోర్డు జాప్యం చేయడంతో ఆ వివరాలు మంత్రిత్వ శాఖకు అందలేదు. అందువలనే ఆటగాళ్ల ప్రయాణం అర్థాంతరంగా ఆగిపోయింది. ఈ సమస్యని త్వరలోనే పరిష్కరించి జట్టుని ఇండియా పంపుతామని లంక బోర్డు చెబుతోంది.

Comments