ప్రచురణ తేదీ : Mon, Aug 7th, 2017

త్వరలో ఏర్కాకులం ఎక్ష్ ప్రెస్ క్రికెట్ లోకి రీఎంట్రీ ఇస్తుంది! ఎవరంటే?

ఇండియన్ క్రికెట్ టీంలో ఫాస్ట్ బౌలర్ గా కెరియర్ స్టార్ట్ చేసి అనతి కాలంలోనే స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న ఆటగాడు శ్రీశాంత్. అయితే అతని కెరియర్ ఎంత వేగంగా ఉన్నత స్థాయికి వెళ్లిందో అంతే వేగంగా స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో కెరియర్ మసకబారింది. అతని బౌలింగ్ ప్రతిభ చూసినవారు, భవిష్యత్తులో టీం ఇండియాకి నెంబర్ వన్ బౌలర్ అవుతాడని ఎంతో మంది మాజీల నుంచి ప్రసంశలు అందుకున్నాడు. అయితే ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ ఉదంతంతో తర్వాత బీసీసీఐ అతని మీద జీవిత కాలం నిషేధం విధించింది. అయితే శ్రీశాంత్ తో పాటు నిషేధం ఎదుకొన్న మిగిలిన బౌలర్స్ మీద మెల్లగా నిషేధం తొలగించుకుంటూ వచ్చారు. అయితే బీసీసీఐ శ్రీశాంత్ మీద మాత్రం నిషేధం కొనసాగించింది. దీంతో అతను కోర్ట్ ని ఆశ్రయించడంతో, శ్రీశాంత్ మీద నిషేధం ఎత్తివేయాలని న్యాయస్థానం బీసీసీఐకి ఆదేశాలు ఇచ్చింది.

దీంతో ఇప్పుడు ఈ ఎర్నాకులం ఎక్స్ ప్రెస్ బౌలర్ కి ఒక లైన్ క్లియర్ అయ్యింది. త్వరలో మరల ప్రొఫిషనల్ క్రికెట్ లో ఎంట్రీ ఇస్తానని శ్రీశాంత్ ఇప్పటికే చెప్పాడు. ఇప్పుడు ఆ అవకాశం అతనికి రానుంది. అయితే మునుపటి సత్తా చూపించి టీం ఇండియాలో స్థానం సంపాదించడం మాత్రం చాలా కష్టమైన పని. అయితే ప్రస్తుతం శ్రీశాంత్ హీరోగా టర్న్ తీసుకొని తమిళ, తెలుగు, మలయాళీ భాషల్లో టీమ్- 5 అనే మూవీలో హీరోగా చేసాడు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకి రానుంది.

Comments