ప్రచురణ తేదీ : Dec 30, 2016 12:40 PM IST

ఆ వార్త విని ఆనందం తట్టుకోలేక గుండెపోటుతో చనిపోయాడు

man
ఎవరి చావు ఎప్పుడు ఎటు పక్కనుండి వస్తుందో ఎవరిని తీసుకుపోతుందో ఎవరికీ తెలీదు. ఉత్తరప్రదేశ్ లో ఒక వ్యక్తి ఒక ఆనందకరమైన వార్త విని ఆనందం తట్టుకోలేక గుండెపోటుతో కుప్పకూలి చనిపోయాడు. ఆయన ఉత్తరప్రదేశ్ లోని ఒక సమాజ్ వాది పార్టీ నేత. ఆయనకు నిన్న అదృష్టం తలుపు తట్టింది. తలుపు తీసేలోపే దురదృష్టం వచ్చి తన్నుకుపోయింది.

రెండురోజుల క్రితం సమాజ్ వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం అభ్యర్థులను ప్రకటించారు. ఇందులో భాగంగా అగ్ర కంట్ స్థానానికి చంద్రసేన్ తప్లు (45) అనే ఎస్పీ నేతకు టికెట్ లభించింది. దీంతో ఆయన ఆనందంలో మునిగిపోయారు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి సంబురాలు చేసుకున్నారు. ములాయంకు ధన్యవాదాలు చెప్పిన ఆయన చాలా సంతోషంగా గడిపారు. కానీ గురువారం ఉదయం 8 గంటలకు ఛాతీలో నొప్పి వస్తుందని చెప్పగా సమీపంలోని ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. గుర్గావ్ లోని వేదాంత ఆసుపత్రికి తీసుకు వెళ్లాలని అక్కడి వైద్యులు సూచించడంతో అక్కడకు తీసుకువెళ్తుండగా మార్గ మద్యంలోనే మధుర టోల్ ప్లాజా వద్ద ప్రాణాలు కోల్పోయారు. దాంతో అప్పటివరకు సంబరాలు చేసుకున్న బంధువులు, కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.

Comments