కందల వీరుడు… చావుకి చాలా ఈజీ గా చేరిపోయాడు! వైరల్ వీడియో!


ఎప్పుడు ఏ క్షణాన ఏం జరుగుతుందో ఎవరు ఊహించలేరు. ఎంతటి బలవంతులైన, కోటీశ్వరుడైన మరణం దారికి చేరితే దాన్ని ఎవరు తప్పించలేరని చాలా సార్లు విన్నాం చూశాం.. ఇప్పుడు అలాంటి ఘటనే ఘటనే మరొకటి జరిగింది. కండలు తిరిగిన ఓ వ్యక్తి అభిమానుల ముందు ఓ ఫిట్ చేద్దామనుకున్నారు కానీ అనుకోకుండా అతన్ని మరణం కాటు వేసింది. అసలు వివరాల్లోకి వెళితే దక్షిణాఫ్రికాకు చెందిన ప్రముఖ బాడీ బిల్డర్‌ సిఫిసో లున్జెలో తబేత్‌(23) ఎమ్లాంజీలో జరిగిన బాడీ బిల్డింగ్‌ పోటీల్లో పాల్గొన్నాడు.

అనంతరం అభిమానుల కేరింతల్లో జిమ్నాస్టిక్‌ స్టంట్‌ చేయబోయి ఒక్కసారిగా గాలిలోకి ఎగిరి పల్టీలు కొడదామనుకున్నాడు. అయితే ఎగిరిన సమయంలో అతను బ్యాలెన్స్ తప్పి బాడీ మొత్తం ఒక్కసారిగా బాడీ బరువు మెడ మీద పడడటంతో మళ్లీ లేవలేదు. చిన్న దెబ్బె అనుకున్నారు కానీ అతడిలో ఏ మాత్రం చలనం లేదు. వెంటనే అతన్ని ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే ప్రాణాలు వదిలినట్టు వైద్యులు నిర్దారించారు. దీంతో ఒక్కసారిగా అతని అభిమానులు, కుటుంబీకులు ఎంతో బాధకు లోనయ్యారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబందించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Comments