ప్రచురణ తేదీ : Thu, Oct 12th, 2017

లక్ష్మీస్ ఎన్టీఆర్..హీరోయిన్ ని సెలెక్ట్ చేసిన సోమిరెడ్డి..!

లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం విషయంలో వర్మ మరియు టిడిపి నేతల మధ్య వివాదం ముదురుతోంది. ఎన్టీఆర్, లక్ష్మీపార్వతి బంధానికి సంబందించిన సంఘటనలు, ఎన్టిఆర్ చివరి రోజుల్లో చోటుచేసుకున్న రాజకీయ అంశాలపై సినిమా తీస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్ర ఫస్ట్ లుక్ కుడా విడుదలైంది. వర్మ ఈ ప్రకటన చేయగానే టిడిపి నేతలు ఆయనపై ఎదురుదాడికి దిగారు. ఎన్టిఆర్ పై సినిమా తీయాలనుకుంటే మొదట తమ అనుమతి అవసరమని వర్మకు హెచ్చరించారు. డైలాగ్ టూ డైలాగ్ తమకు వివరించి ఓకే చేశాకే సినిమా మొదలు పెట్టాలని టిడిపి ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ హెచ్చరించారు.

తాజాగా టీడీపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంపై కామెంట్ చేశారు. రామ్ గోపాల్ వర్మ హిట్టయ్యే చిత్రాలు తీసుకుంటే మంచిదని సోమిరెడ్డి సూచించారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి.. వర్మ మరియు లక్ష్మీపార్వతిలపై సెటైర్లు వేశారు. త్యాగశీలి లక్ష్మీపార్వతి.. ఈ సినిమాలో ఆమెనే హీరోయిన్ గా పెట్టుకోమని వ్యంగ్యం సంధించారు. సోమిరెడ్డి వ్యాఖ్యలకు వర్మ కూడా అంతే ఘాటుగా బదులిచ్చారు. మీ ఉచిత సలహాకు ధన్యవాదాలు.. అలాగే చేస్తా.. మీరు ఓకే అంటే హీరోగా ఆమె పక్కన మిమ్మల్నే పెడతా అంటూ వర్మ బదులిచ్చారు.

Comments