ముందు నుయ్యి… వెనక గొయ్యి.! ఎలా అయిన సాఫ్ట్ వేర్ వాళ్లకి కష్టమే!

సాఫ్ట్ వేర్ ఇండస్ట్రీలో ఆటోమేషన్ టెక్నాలజీతో కొత్త పుంతలు తొక్కుతున్న కంపెనీలు, ఉద్యోగులకి మంగళం పాడేస్తూ ఉన్నాయి. దీంతో ఒకప్పుడు లక్షలు జీతాలు తీసుకొని సాఫ్ట్ వేర్ లో ప్రస్తుతం ఉద్యోగ భద్రత కరువైంది. దీంతో ఉద్యోగాన్ని కాపాడుకోవడానికి సాఫ్ట్ వేర్ ఎంప్లాయిస్ అందరు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. అయితే ఉద్యోగాన్ని కాపాడుకోవాలంటే. టెక్నాలజీ లో అప్ గ్రేడ్ అవ్వాలి. ఆ విషయంలో ఏళ్ళుగా కంపెనీలు పాతుకుపోయి సీనియర్ పొజిషన్ లో కొనసాగుతున్న ఉద్యోగులకి తలకి మించిన పని అవుతుంది. ఇంత కాలం ఏదో క్రింది ఉద్యోగుల చేత పనిచేయిన్చుకునే బాస్ పొజిషన్లో ఉన్నవారు కూడా ఉద్యోగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అయితే కంపెనీలలో ఉన్న ఉద్యోగులకి ఆయా కంపెనీలు ఓ గొప్ప అవకాశం ఇచ్చింది. కొత్తగా మార్కెట్ లోకి వచ్చి కంపెనీలో ఉన్న ప్రోగ్రామింగ్ మీద, సాఫ్ట్ వేర్స్ మీద అవగాహన పెంచుకోవాలని చెబుతున్నాయి. ఏడాది కాలం ఉండే ఈ కొత్త కోర్సులు నేర్చుకోవాలంటే ఒక్కో ఏడాది కాలానికి సుమారు 4 లక్ష రూపాయిల వరకు ఖర్చు చేయాల్సి అవసరం ఏర్పడింది. ఈ కోర్స్ లని కూడా కంపెనీలే ప్రోవైడ్ చేస్తున్నాయి.

దీంతో ఉద్యోగం ఉండాలంటే ఎంప్లాయిస్ ఏడాదిలో నాలుగు లక్షర రూపాయిలు కోర్స్ ఫీజ్ క్రింద చెల్లించాలి. అసలే రిషేషన్ లో ఉద్యోగాలు పోగొట్టుకుంటే ఇప్పుడు కొత్త కోర్స్ లు నేర్చుకొని మళ్ళీ మొదటి నించి ప్రయాణం మొదలుపెట్టాల్సిన అవసరం వచ్చింది. అయితే ఈ విషయంలో ఫ్రెషర్స్ కి మినహాయింపు ఉంది. ఎందుమంటే వాళ్ళు ముందుగానే కంపెనీ అవసరాలకి కావాల్సిన కోర్స్ లు నేర్చుకొని వస్తారు కాబట్టి. మరి నాలుగు లక్షలు ఖర్చు పెట్టి కంపెనీలో పని చేస్తున్న ఉద్యోగులు కోర్స్ లు నేర్చుకుంటారో లేక ఉద్యోగాన్ని వాడులుకుంటారో అనే విషయం వారికే తెలియాలి.

Comments