సోషల్ మీడియాలో సానుభూతి మోసం? ఇదో కొత్త రకం మోసం!


ఎవరైనా దాతలు ఉంటె సాయం చేయండి.. ఈ అబ్బాయి బ్రతుకుతాడు. ఇతను బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్నాడు… ఈ అమ్మాయికి ఆపరేషన్ చేస్తే కళ్ళు వస్తాయని డాక్టర్స్ చెప్పారు.. ఇతను ఇతను కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు. ఆపరేషన్ చేస్తే నయం అవుతుంది అని డాక్టర్స్ చెప్పారు. ఇలాంటి పోస్ట్ లో సోషల్ మీడియాలో నిత్యం చూస్తూ ఉంటాం. అయితే వీటిలో నిజమెంత తెలుసుకోకుండా కొంత మంది అందులో ఇచ్చిన బ్యాంకు అకౌంట్స్ కి డబ్బులు పంపిస్తారు. కాని తరువాత ఫేక్ అని తెలిస్తే తలలు పట్టుకోవడం తప్ప మరేం చేయలేరు. ఇలాంటి సంఘటన తాజాగా అమెరికాలో జరిగింది. తను ల్యూకేమియా, లివర్‌ కాన్సర్‌తో బాధపడుతున్నానని, ఆమె ఫోటోలు పేస్ బుక్ లో అప్లోడ్ చేసేది. క్రింద సాయం చేయమని ఎకౌంటు నెంబర్ కూడా ఇచ్చేంది. అలా ఆమె వలలో చాలా మంది పడి డబ్బులు సాయం చేసారు. అయితే మోసం ఎంతో కాలం దాగదు. ఆమె మోసం బయటపడింది.

ప్రజలను మోసం చేస్తూ డబ్బు గుంజుతుందన్న ఆరోపణలతో న్యూయార్క్‌లోని వెస్ట్‌ చెస్టర్‌కు చెందిన హుబ్రాజ్‌(38) అనే మహిళను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. గత రెండేళ్లుగా ఈమె అనేక పేర్లు మార్చుకుని ఈ దందాకు పాల్పడుతోందని పోలీసులు తెలిపారు. కాన్సర్‌ బాధితురాలిగా గుండు కొట్టించుకుని తన ఇద్దరు పిల్లలతో ఉన్న ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేసి అందరినీ మోసం చేస్తోందని పోలీసులు పేర్కొన్నారు. ఇప్పటి వరకు 300 మందిని మోసం చేసి సుమారు 50 వేల డాలర్లు వసూలు చేసిందని తెలిపారు. ఇలా మోసం చేసి డబ్బులు దండుకోవడం చాలా దారుణమైన చర్య అని, ఇలాంటి వాళ్ల వల్ల నిజంగా సహాయం అర్థించే వారిని అనుమానించాల్సి వస్తుందని న్యూయార్క్‌ ఎఫ్‌బీఐ ఇన్‌ఛార్జ్‌ విలియం స్వీనే పేర్కొన్నారు.

Comments