ప్రచురణ తేదీ : Fri, Sep 8th, 2017

సచిన్ కు ఆరేళ్ళ పాప లేక ఇలా రాసింది!!


సాధారణంగా క్రికెట్ అంటే మనకు టక్కున గుర్తొచ్చే పేరు సచిన్ టెండూల్కర్. క్రికెట్ అంటే తెలియని వారికి కూడా సచిన్ పేరు ఎప్పుడో ఒకప్పుడు విని క్రికెట్ అంటే సచిన్ అని అనేస్తారు. పిల్లలు కూడా సచిన్ అంటే చాలు ఉప్పొంగిపోతారు. అయితే సచిన్ క్రికెట్ కి వీడ్కోలు పలికిన తరువాత కూడా అభిమానులు ఇంకా ఆయనను మరచిపోలేకపోతున్నారు. దీంతో సచిన్ కూడా అభిమానుల ప్రేమను మర్చిపోలేక తరచు సోషల్ మీడియాలో ఎదో విధంగా స్పందిస్తారు. అభిమానులు కూడా సచిన్ ట్విట్టర్ అకౌంట్ ని రోజు ఫాలో అవుతుంటారు.

అయితే రీసెంట్ గా సచిన్ కి చిన్నారి పాప పంపిన లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. ఎందుకంటే ఆరేళ్ల పాప సచిన్ కి ఎంత అభిమానంతో ఆ లేఖను పంపిందో ఒకసారి చదివితే అర్ధమవుతుంది. డియర్ సచిన్ అంకుల్ అంటూ.. నా పేరు తార అని బ్రాకెట్ లో సచిన్ కూతురు సారా లా అని మెన్షన్ చేసింది. అలాగే నేను ‘సచిన్: ఎ బిలియన్ డ్రీమ్స్’ సినిమాను చూశానని చెబుతూ.. తనకు సినిమా చాలా నచ్చిందని చెప్పింది. సినిమాలో చాలా బావున్నారని చివరి సీన్స్ లో చాలా ఏడుపొచ్చిందని సచిన్ కుటుంబాన్ని కలవని ఆ పాప కోరింది. అయితే సచిన్ ఆ లేఖను తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసి చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ. కృతజ్ఞతలు చెప్పాడు. అలాగే తార నువ్వు ఎప్పుడు నవ్వుతు ఉండలని ట్వీట్ చేశాడు.

Comments