ఒక్క తుపాకి… రెండు బుల్లెట్లు! గౌరీ లంకేష్ ని చంపింది మావోలే?

పాత కాలంలో ఒక సామెత భాగా ఫేమస్. ఒకే దెబ్బకి రెండు పిట్టలు. ఈ మాట చాలా సందర్భాల్లో ఉపయోగిస్తూ ఉంటారు. ఇప్పుడు బెంగుళూరు గౌరీ లంకేష్ మర్డర్ మిస్టరీలో కూడా ఫోరేనిక్స్ నివేది చెప్పిన నిజాలు చూస్తే ఒక్క గన్ రెండు బుల్లెట్లు అని అనుకోవాల్సి వస్తుందేమో. ఎందుకంటే గౌరీని హత్య చేసిన హంతకులు ఉపయోగించి బుల్లెట్స్, అలాగే కన్నడ స్కాలర్ ఎం ఎం కల్బుర్గీని చంపడానికి ఉపయోగించిన బుల్లెట్స్ ఒకే తుపాకితో ఉపయోగించారని, రెండు నేరాలకి వాడిన ఆయుధం సుమారు 80 శాతం ఒకేలా ఉందని ఫోరోనిక్స్ బృందం చెబుతున్నారు. దీంతో రెండేళ్ళ క్రితం కుల్బుర్గీని, ఇప్పుడు గౌరీ లంకేష్ ని చంపినా వాళ్ళు ఒకే గ్యాంగ్ అయ్యే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు.

ఇప్పటికే గౌరీ హత్య కేసులో సిట్ అధికారులు 80 మందిని అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు. ఇక గౌరీని మావోయిస్టులు చంపి ఉంటారని సిట్ అధికారులు భావిస్తున్నారు. ఇప్పుడు సిట్ అధికారులు ఇచ్చిన సమాచారంతో ఇంత వరకు హిందుత్వ వాదులు గౌరీని చంపేశారని హడావిడి చేసిన కొందరు మేధావులు, కమ్యునిజం భావజాలం అని చెప్పుకునే సిద్ధాంత కర్తల నోటికి తాళం పడినట్లు అయ్యింది. మరి గౌరీ లంకేష్ కేసులో కీలక నిందుతులని ఎప్పుడు పట్టుకుంటారో, అప్పటి వరకు ఇంకా కొంత మంది షో కాల్డ్ మేధావులు తమకు అలవాటైన పంథాలో బీజేపీ మీద హిందుత్వ సంస్థల మీద విమర్శలు చేస్తూనే ఉంటారు.

Comments