ప్రచురణ తేదీ : Nov 4, 2017 11:58 PM IST

టి 20 మ్యాచ్ : హైదరాబాద్ కుర్రాడు అడుగేశాడు..!

ప్రస్తుతం న్యూజిలాండ్, భారత్ జట్ల మధ్య మూడు టి 20 ల సిరీస్ జరుగుతోంది. తొలి మ్యాచ్ లో టీం ఇండియా అవలోక విజయం సాధించగా రెండవ టి 20 మ్యాచ్ రాజ్ కోట్ లో ప్రారంభం అయింది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. కాగా ఈ మ్యాచ్ లో హైదరాబాద్ యువ ఫేసర్ మహమ్మద్ సిరాజ్ ఎంట్రీ ఇచ్చాడు. అతడికి ఇది డెబ్యూ మ్యాచ్ కావడం విశేషం.

ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదేరాబద్ తరుపున సత్తా చాటిన సిరాజ్ జాతీయ జట్టులో కూడా స్థానం సంపాదించుకున్నాడు. టీం ఇండియా కోచ్ రవిశాస్త్రి సిరాజ్ కు క్యాప్ అందించి జట్టులోకి ఆహ్వానించాడు. ఇదిలా ఉండగా తొలి మ్యాచ్ లో ఓటమి చెందిన న్యూజిలాండ్ జట్టు ఎలాగైనా ఈ మ్యాచ్ లో విజయం సాధించి సిరీస్ ని సమం చేయాలనే పట్టుదలతో ఉంది.

Comments