ప్రచురణ తేదీ : Feb 23, 2017 9:55 PM IST

కలక్టర్ గా పీవీ సింధూ ..


ఒలంపిక్స్ లో భారత కీర్తి పతాకం దిఘ్విజయంగా ఎగరు వేసి వంద కోట్ల మంది భారతీయుల మనసు గెలుచుకుంది పీవీ సింధూ. ఇప్పుడు ఆమె డిప్యూటీ కలక్టర్ హోదా లో సర్కారీ కొలువు లో చేర బోతోంది. రియో ఒలంపిక్స్ లో పథకం సాధించినందుకు గాను సింధూ కి రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు భారత ప్రభుత్వం కూడా భారీగా నజరానాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఏపీ సర్కారు ఆమెకి డిప్యుటీ గ్రూప్ 1 అధికారి గా బంపర్ ఆఫర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం కూడా ఇదే తరహా ప్రకటన చేసినప్పటికీ… తాను ఏపీకి చెందినదానినన్న ఉద్దేశంతో పీవీ సింధూ… ఏపీ ప్రభుత్వ ప్రకటనకు తన సానుకూలతను వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆమెను గ్రూప్-1 అధికారిణిగా నియమించేందుకు అవసరమైన కసరత్తును చంద్రబాబు సర్కారు పూర్తి చేసింది. నేడో రేపో ఈ మేరకు ఉత్తర్వులు వెలువడనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్రభుత్వ ప్రకటనకు సంబంధించిన విషయం తెలుసుకున్న పీవీ సింధూ కూడా తన సంతోషాన్ని వ్యక్తం చేసింది.

Comments