హిట్టా లేక ఫట్టా : సిల్లీ ఫెలోస్.. సిల్లీ సినిమా!

గత కొంత కాలంగా విజయాలు లేక సమతమతమవుతున్న కథానాయకుడు నరేష్. సునీల్ పరిస్థితి కూడా అదే తరహాలో ఉందని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక ఈ సారి ఇద్దరు కలిసి సిల్లీ ఫెలోస్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. రీమేక్ సినిమాల స్పెషలిస్ట్ బిమనేని శ్రీనివాస్ ఈ సినిమాను తెరకెక్కించారు. పూర్ణ , చిత్రశుక్ల కథానాయకులుగా నటించారు. సినిమా విషయానికి వస్తే.. సినిమా అనుకున్నంత రేంజ్ లో మాత్రం ఆకట్టుకోలేదనే టాక్ వస్తోంది.

తమిళంలో హిట్టయిన ‘వెలైను వంధుట్ట వెల్లకారన్‌’ అనే సినిమాకు సిల్లీ ఫెలోస్ రీమేక్. తెలుగు నేటివిటికి తగ్గట్టుగా కొద్దిపాటి మార్పులతో దర్శకుడు సినిమాను తెరకెక్కించాడు. ఫస్ట్ హాఫ్ లో సునీల్ నరేష్ మధ్యన సాగే కామెడీ సన్నివేశాలు బాగుంటాయి. ఇద్దరు వారి పాత్రలకు న్యాయం చేశారు.ల కానీ సెకండ్ హాఫ్ లో మాత్రం సినిమా అంతగా ఆకట్టుకోదు. ముఖ్యంగా పోసాని జేపీ మధ్య సాగె సన్నివేశాలు వీసుకుతెప్పిస్తాయి. తమిళ్ లో ఇది కొత్త తరహా కథే అయినా తెలుగు ప్రేక్షకులకు మాత్రం చాలా రొటీన్ గా అనిపిస్తుంది. ఇక ఈ సినిమాకు వివిధ వెబ్ సైట్లు ఇచ్చిన రేటింగ్స్ ఈ విధంగా ఉన్నాయి.

సిల్లీ ఫెలోస్ – రొటీన్ గానే సాగిన ఎంటర్ టైన్ చేస్తోంది

Reviewed By 123telugu.com |Rating :2.75/5

సిల్లీ ఫెలోస్.. సిల్లీ సినిమా!

Reviewed By tupaki.com |Rating :1.5/5

ఓల్డ్ స్కూల్ కామెడీ

Reviewed By gulte.com |Rating : 2.5/5

సిల్లీ కామెడీ

Reviewed By www.greatandhra.com|Rating : 2.5/5

నాసిరకమైన హాస్యా చిత్రం

Reviewed By telugu.filmibeat.com|Rating : 1.0/5


 


Comments