ప్రచురణ తేదీ : Sep 25, 2017 8:32 AM IST

పెళ్లిలో నిజంగా పవన్ అలా చేశాడా..ఇమేజ్ ని దిగజార్చే ప్రయత్నమా..?


జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రతిష్టని దిగజార్చేలా ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. జనసేన మద్దత్తు దారులు, పవన్ అభిమానులు మాత్రం ఇది ఖచ్చితంగా కట్టు కథే అని ఇలాంటి వార్తలు ఎన్ని పుట్టుకొచ్చిన పవన్ ఇమేజ్ కు వచ్చిన నష్టం ఏమాత్రం లేదని అంటున్నారు. ఇంతకీ పవన్ కళ్యాణ్ గురించి సర్కులేట్ అవుతున్న ఆ పుకారు వివరాలు చూద్దాం..

ఇటీవల ఎన్టీవీ నరేంద్ర చౌదరి కుమార్తె వివాహం వైభవంగా జరిగింది. ఆ వివాహానికి సినీ రాజకీయ ప్రముఖులంతా హాజరై వధూవరులని ఆశీర్వదించారు. కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం ఆ వేడుకలో ఎక్కడా కనిపించలేదు. స్వతహాగా పవన్ కళ్యాణ్ వేడుకలకు హాజరయ్యేది చాలా తక్కువ. సినిమా ఫంక్షన్లు, ఇతర వేడుకలు పవన్ కళ్యాణ్ ఆమడ దూరంలో ఉంటారు. కానీ జనసేన పార్టీ స్థాపన తరువాత పరిచయాల కోసం పవన్ కొన్ని వేడుకలకు హాజరు కావడం మొదలయింది. అది కూడా తీరిక ఉంటె మాత్రమే. నరేంద్ర చౌదరి తో పవన్ కళ్యాణ్ కు మంచి అనుభందమే ఉంది. ఎన్టీవీ, భక్తి భక్తి టివి అద్వర్యం లో నిర్వహించే కోటిదీపోత్సవం కార్యరాక్రమానికి గతంలో పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఆ తరువాత కాటమరాయుడు ఆడియో వేడుకకు నరేంద్ర చౌదరి గెస్ట్ గా హాజరయ్యారు. వీరి మధ్య ఉన్న అనుభందంతో నరేంద్ర చౌదరి వివాహ వేడుకకు పవన్ ఖచ్చితంగా హాజరవుతారని అంతా భావించారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం పెళ్ళికి హాజరు కాలేదు.

దీనిని ఆసరాగా చేసుకుని కొందరు పుకారు రాయుళ్లు ఈ వార్తలకు సృష్టించినట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ బయలు దేరి వివాహ వేడుక వద్దకు చేరుకున్నారని కానీ అదే సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కాన్వాయ్ రావడంతో ప్రోటోకాల్ ప్రకారం పవన్ వాహనాన్ని పక్కనే కొద్దీ సేపు నిలిపి ఉంచడంతో అసహనానికి లోనై అటునుంచి అటే వెళ్లిపోయాడట. సోషల్ మీడియాలో జరుగుతున్నా ప్రచారానికి ఇదే సారాంశం. తల తోక తెలియని ఈ వార్తకు పవన్ కళ్యాణ్ రాజకీయాల్ని కూడా ముడి పెడుతున్నారు. కొద్ది సేపు ఓపిక పట్టలేనివాడు రాజకీయాల్లో ఎలా రాణిస్తాడని సెటైర్లు వేస్తున్నారు. సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతున్న పుకారు కారణంగా చూపి పవన్ ని విమర్శించడం వలన వచ్చిన నష్టం లేదని జనసేన వర్గాలు చెబుతున్నాయి.

Comments