ప్రచురణ తేదీ : Dec 7, 2017 10:20 PM IST

షర్మిల, విజయమ్మ పొలిటికల్ రీ ఎంట్రీ ఉంటుందా..?

వైసిపి అధినేత జగన్ జైల్లో ఉండగా ఆయన సోదరి షర్మిల పార్టీని విజయవంతంగా నడిపించారు. జగన్ తల్లి విజయమ్మ గత సార్వత్రిక ఎన్నికల్లో వైజాగ్ నుంచి ఎంపీగా పోటీ చేసి భంగ పడ్డారు. ఆ తరువాత వాళ్లిద్దరూ రాజకీయాలకు దూరమయ్యారు. విజయమ్మ, షర్మిల తిరిగి రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదా ? దీనిపై జగన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. వైఎస్ కుటుంబ సభ్యుల మధ్య ఆత్మీయ అనురాగాలు ఎక్కువగా ఉంటాయని సన్నిహితులు చెబుతుంటారు. జగన్ ఈ విషయాన్నీ ప్రస్తావిస్తూ షర్మిల, విజయమ్మ గురించి మాట్లాడారు.

తాను జైలులో ఉన్న సందర్భముగా పార్టీని నడిపించడానికి, తనపై జరుగుతున్న కుట్రలని ఎదుర్కొనడానికి అమ్మ, చెల్లి ముందుకు వచ్చారు. సోదరికిగాని, అమ్మకు గాని రాజకీయాల్లో ఉండాలన్న కోరిక లేదు. వాళ్లకు పదవులపై ఆశ లేదు. విధిలేని పరిస్థితుల్లోనే వారు అప్పుడు రాజకీయాల్లో కొనసాగారు అని జగన్ వివరణ ఇచ్చారు. జగన్ మాటల ద్వారా వారు తిరిగి రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేనట్లు తెలుస్తోంది.

Comments