షాకింగ్ వీడియో : ‘జోహార్ పవన్’ అనటం ఏంటిరా బాబూ!!

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రస్తుతం ప్రత్యేక హోదా ఉద్యమానికి తన వంతు చేయూతను అందిస్తున్నారు. పార్టీలకు అతీతంగా హోదా కోసం ఎవరు ముందుకు వచ్చినా సరే వారితో కలిసి నడుస్తామని ఆయన ఇటీవల ప్రకటన చేశారు. తాజాగా టీడీపీ సర్కారుపై పవన్ విమర్శల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే. గత నాలుగేళ్లుగా చంద్రబాబు ప్రభుత్వాన్ని పల్లెత్తుమాట అనని పవన్‌, ఒక్కసారిగా ఇప్పుడెందుకు నిందిస్తున్నారు అని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. అలానే చంద్రబాబు సర్కారులో అవినీతి అమాంతం పెరిగిపోయిందంటూ ఆయన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

బాబు తనయుడు లోకేశ్‌ అవినీతిపరుడని, అతని అవినీతిపై ఆధారాలు కూడా ఉన్నాయని ప్రకటించి పవన్ టీడీపీ వర్గాల్లో కాక రేపుతున్నారు. ఈ సంగతి ఇలా ఉండగా నేడు సోషల్ మీడియాలో జనసేన కార్యకర్తలకు సంబంధించిన ఓ వీడియో హల్‌చల్‌ చేస్తోంది.ప్రత్యేక హోదా కోసం నేడు జరిగిన ఈ ధర్నా వీడియోలో ఓ జనసేన కార్యకర్త మొదట మహాత్మాగాంధీ, మహాత్మాగాంధీ అంటూ నినదించగా, జై అంటూ తోటి కార్యకర్తలు నినదించారు. అతను అంతటితో ఆగకుండా ‘జోహార్‌ పవన్‌ కల్యాణ్‌’ అంటూ నినాదమివ్వగా, మిగతా కార్యకర్తలు కూడా ‘జోహార్‌ జోహార్‌’ అంటూ ప్రతిస్పందించి, వెంటనే నాలుక కరుచుకున్నారు.

ఈ సందర్భంగా మిగతా కార్యకర్తలు ఇదేంటి అని వారించడం వీడియోలో చూడొచ్చు. అమరులైన వారికి మాత్రమే జోహార్లు అర్పించడం పరిపాటి. ‘జోహార్ పవన్ కల్యాణ్ ఏంట్రా నాయనా, అని ఈ వీడియోపై పలువురు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అయితే ప్రముఖ సినీ విమర్శకుడు కత్తి మహేశ్‌ కూడా ఈ వీడియోను సరదాగా రీట్వీట్‌ చేశారు….

Comments