ప్రచురణ తేదీ : Dec 30, 2016 3:49 PM IST

వయస్సులో చిన్న వ్యక్తి ప్రేమకు పడిపోయిన టెన్నిస్ స్టార్..త్వరలో పెళ్లి కూడా..!

serena-williams
టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ పెళ్లికూతురు కాబోతోంది. ఆల్రెడీ తన నిశ్చితార్థం జరిగిపోయినట్లు సెరెనా విలియమ్స్ ప్రకటించింది. రెడ్దిట్ సహా వ్యవస్థాపకుడైన అలెక్సిస్ ఒహానియన్ తో తన వివాహం జరగనున్నట్లు ఆమె ప్రకటించడం విశేషం.ఈ విషయాన్ని ఆమె రెడ్దిట్ ద్వారా ప్రకటించింది. అయితే ఆమె వివాహ తేదీని మాత్రం ప్రకటించలేదు. తాము తొలిసారి అనుకోకుండా రోమ్ నగరంలో కలుసుకున్న చోటే అలెక్సిస్ పెళ్లిప్రతిపాదన తెచ్చాడని తాను వెంటనే ఒప్పుకున్నాన్ని సెరెనా తెలిపింది. సెరెనా అంగీకారం తనని ప్రపంచం లోనే అదృష్టవంతుణ్ణి చేసిందని అలెక్సిస్ పేర్కొన్నాడు.

ఇందులో మరో విశేషం ఏమిటంటే అలెక్సిస్ సెరెనా కన్నా వయస్సులో రెండేళ్లు చిన్నవాడు. సెరెనా ప్రస్తుత వయస్సు 35 ఏళ్లు కాగా అలెక్సిస్ వయస్సు 33 ఏళ్లు. కాగా ఉమెన్స్ టెన్నిస్ అసోసియోషన్ వెంటనే ఈ జంటకు శుభాకాంక్షలు తెలిపింది. సెరెనా తన కెరీర్ లో 71 సింగిల్స్ టైటిల్స్ ను సొంతం చేసుకుంది. 186 వారాల పాటు సెరెనా వరల్డ్ లో నెంబర్ వన్ గా కొనసాగిన టెన్నిస్ స్టార్ ఈమే.

Comments