ప్రచురణ తేదీ : Mon, Feb 13th, 2017

పవన్ కళ్యాణ్ ని నమ్మి వస్తారా..?


జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అమెరికా పర్యటనలో బిజీగా గడుపుతున్నారు. హార్వర్డ్ యూనివర్సిటీ లో ఇండియా కాన్ఫెరెన్స్ కార్యక్రమానికి ఆయన అతిథిగా వెళ్లారు.అంతకంటే ముందు పవన్ తన అభిమానులు ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. న్యూ హాంప్ షైర్ లో ఏర్పాటు చేరిన ఓ కార్యక్రమం లో మాట్లాడుతూ జనసేనపార్టీకి నిధులు ఇచ్చేవారు ఉన్నారని కానీ వాటిని తాను ఇప్పుడే తీసుకోనని అన్నారు. తన పార్టీ లో అన్ని పారదర్శకత తో జరగాలని కోరుకుంటానని అన్నారు. తనని నమ్మి వచ్చిన ప్రతి ఒక్కరికి ఖర్చు వివరాలు తెలిసేలా పార్టీని ముందుకు నడిపించగలిగినపుడే తాను పార్టీ కోసం విరాళాలు సేకరిస్తామని పవన్ అన్నారు.

జనసేన పార్టీ కి నిధులు ఇవ్వడానికి ముందుకువచ్చిన ఎన్నారై లతో కూడా పవన్ ఇదే చెప్పినట్లు తెలుస్తోంది. భవిషత్తు లో తన పార్టీ జనసేన అవసరాలకోసమే పవన్ వారిని సమాయత్తం చేయడానికి వెళ్లారని పవన్ అమెరికా పర్యటన వెనుక ఉన్న సీక్రెట్ అజెండా ఇదేనని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. కాగా ఇప్పటికే ఏపీ లో సభలు సమావేశాలు నిర్వహించి ప్రజలకు చేరువవుతున్న పవన్ అమెరికాలోని తన అభిమానులను జనసేన పార్టీ అభిమానులుగా మార్చడానికి ప్రయత్నిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. కాగా 2019 ఎన్నికల్లో పవన్ పోటీచేయనున్నారు. ఆశయం లో ఎన్నారై ల సహకారం కీలకం కానుందనే చర్చలు వినిపిస్తున్నాయి. చూద్దాం పవన్ మీద భరోసాతో ఎంతమంది ఎన్నారై లు కదులుతారో..!!

Comments