వీడియో : బిల్డింగ్ పై నుంచి దుకాలని చూసింది..అప్పుడు ప్రిన్సిపాల్ వచ్చి..


ప్రస్తుత రోజుల్లో కొన్ని విద్యా సంస్థలు చదువు పేరిట విద్యార్థులను తీవ్ర మనోవేదనకు గురి చేస్తున్నాయి. అలాగే దైర్యం చెప్పాల్సిన తల్లి దండ్రులు కూడా పిల్లలకు ర్యాంకులు రావాలని ఒత్తిడి తెస్తున్నారు, ముఖ్యంగా చదువులేకపోతే అసలు జీవితమే వ్యర్థం అనే స్థాయికి వారిని దిగజార్చడంతో ఆత్మహత్య అనే అర్ధం కూడా తెలియని వయసులో కొందరు పసిపిల్లలు ఆత్మహత్య చేసుకుంటున్నారు. రీసెంట్ గా ఇదే తరహాలో చదువు ని భారంగా భావించి తనువును చాలించాలని అనుకుంది నిండా పదేళ్లు కూడా లేని ఓ పసిపాప. అక్షర భారాన్ని తట్టుకోలేని ఆ బాలిక ఆత్మహత్య అనే పదం గురించి ఎప్పుడు నేర్చుకుందో గాని ఓ బిల్డింగ్ పై నుంచి దుకాలని చూసింది చైనా స్కూల్ విద్యార్థి.

కాస్త లోతును చూస్తేనే గజగజా వణికిపోతారు ఆ పాప వయసు పిల్లలు. కానీ ఆ పాప మాత్రం దాదాపు 15 అంతస్తుల బిల్డింగ్ నుంచి కిందకు చూస్తూ అలాగే నిలబడిపోయింది. ఎవ్వరు వచ్చినా దూకేస్తాను అని చెప్పింది. రక్షణ సిబ్బంది కూడా ఆమెకు కనిపించకుండా దాక్కున్నారు. ఫైనల్ గా దూకుదామనుకున్న సమయంలో ఆ స్కూల్ ప్రిన్సిపాల్ ఆమెకు బాటిల్ లో నీళ్లు ఇచ్చినట్టు చేసి ఆమె దుస్తులు అందగానే లాగేశాడు. వెంటనే సెక్యూరిటీ సిబ్బంది కూడా వచ్చి బాలికను పైకి లాగేసుకున్నారు. మొత్తానికైతే కాపాడారు. అయితే ఈ తరహాలో చైనాలో చాలామంది విద్యార్థులు డిప్రెషన్ కి లోనవుతున్నారట. అలాగే కొంతమంది ఆత్మహత్య చేసుకోవడానికి కూడా వెనుకాడడం లేదని అక్కడి మీడియాల్లో కథనాలు వెలువడుతున్నాయి

Comments