ఆరోజు రాత్రే ఐదుగురు మంత్రులతో..!


జయలలిత నెచ్చెలి శశికళ ముఖ్యమంత్రి కావడానికి ప్రయత్నాలు వేగవంతం చేసారు. ఉన్న అన్ని అవకాశాలను అనే ఉపయోగించుకుంటున్నారు. ప్రయత్నాలు చేత్తోనే మరో వైపు పన్నీర్ సెల్వం ని ఇరుకున పెట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. సోమవారం అన్నా డీఎంకె పార్టీ నేతలు కార్యకర్తలతో సమావేశం అంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసారు. జయలలిత మరణించిన రోజు రాత్రే అన్నా డీఎంకే పార్టీ ని చీల్చే ప్రయత్నాలు మొదలయ్యాయని ఆమె అన్నారు.

అమ్మ మరణించిన రోజు రాత్రే తాను ఐదుగురు మంత్రులతో భేటీ అయినట్లు శశికళ తెలిపారు. మనుతన ముఖ్యమంత్రి నియమించాలని అప్పుడే నిర్ణయించినట్లు శశికళ తెలిపారు. పన్నీర్ సెల్వం తానే ముఖ్యమంత్రిగా ఉంటాయని ముందుకు వచ్చారని కానీ ఇపుడు మాత్రం నీచమైన రాజకీయాలు చేస్తూ డీఎంకే తో చేతులు కలిపారని సంచలన ఆరోపణలు చేసారు. కార్యకర్తలు తననే ముఖ్యమంత్రిగా ఉండమని కోరారని కానీ పన్నీర్ ముందుకు రావడంతో వద్దనుకున్నానని శశికళ తతెలిపారు.

Comments