ప్రచురణ తేదీ : Dec 30, 2016 1:38 PM IST

జయలలిత పరిచయం కాకముందు శశికళ ఏం చేసేదో తెలుసా..?

jayalalithaa-and-sasikala
శశికళ అంటే కేవలం జయలలితకు ప్రాణ స్నేహితురాలిగానే మన అందరికీ తెలుసు. కానీ జయలలిత పరిచయం కాకముందు అసలు శశికళ ఏం చేసేవారో చాలామందికి తెలీదు. శశికళ జీవితం ఒక సినిమా స్టోరీలాగే ఉంటుంది. సామాన్య కుటుంబంలో పుట్టిన ఆమె ఇప్పుడు ఒక రాష్ట్రాన్ని శాసించే స్థాయికి ఎదిగింది. ఒక ప్రాంతీయ పార్టీకి అధ్యక్షురాలిగా ఎన్నికైంది.

శశికళను పెళ్ళైన కొత్తల్లో వీఐపీల ఇళ్ల చుట్టూ తిరిగి వీడియో క్యాసెట్లు అద్దెకు ఇచ్చేది. తంజావూరు వెళ్లి ‘ఇంగ్లీష్ మందుల దుకాణం’ అంటే చాలు అక్కడివాళ్లు శశికళ గురించి అడుగుతున్నారు అంటారు. రామనాథపురంలో నాటు వైద్యం చేసే చంద్రశేఖరన్ పిళ్ళై కుటుంబాన్ని పోషించడానికి తంజావూరు వచ్చారు. ఆయన కుమారుడు వివేకానందన్ తంజావూరులో ఇంగ్లీష్ మందుల దుకాణం నిర్వహించేవారు. ఆయన కుమార్తెనే శశికళ. 1970 లో శశికళ నటరాజన్ ని పెళ్లి చేసుకున్నారు. ఆ సమయంలో నటరాజన్ డీఎంకే తంజావూరు శాఖ నాయకునిగా ఉండేవారు. తన భర్త ఇచ్చిన డబ్బుతో శశికళ 1980లో ‘వినోద్ వీడియో విజన్’ పేరుతొ ఒక షాప్ నడిపేవారు. సరిగ్గా ఆ సమయంలోనే జయలలిత అన్నాడీఎంకేలో నిలదొక్కుకుంటున్నారు. జయకు అప్పట్లో కడలూరు కలెక్టర్ చంద్రలేఖతో మంచి సంబంధాలు ఉండేవి. చంద్రలేఖతో నటరాజన్ కు కూడా మంచి పరిచయాలు ఉన్నాయి. ఆ పరిచయమే శశికళను జయలలితకు దగ్గర చేసింది. ఇప్పుడు జయలలిత మరణం తరువాత ఆమె స్థానంలో శశికళ కూర్చుంది.

Comments