సంధ్యని అందుకే చంపా.. ప్రేమోన్మాది సమాధానం..!

ప్రేమోన్మది కార్తీక్ ఘాతుకానికి బలైన సంధ్య హత్య కేసు సంచలనం సృష్టిస్తోంది. హైదరాబాద్ నగరంలో గురువారం రాత్రి ఈ దారుణం జరగడం కలకం రేపుతోంది. పెట్రోల్ పోసి సంధ్యని తగలబెట్టడంతో ఆమె తీవ్రగాయాల పాలైంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెలిసిందే. పోలీసులు కార్తీక్ ని అదుపులోకి తీసుకున్నారు.

సంధ్యని తానే హత్య చేసిన విషయాన్ని అంగీకరించాడు. తనకు సంధ్యతో మూడేళ్ళ నుంచి పరిచయం ఉందని తెలిపాడు. తనని వన్ సైడ్ లవ్ అని, సంధ్యని ఎంతగానో ప్రేమించానని తెలిపాడు. కానీ సంధ్య నా ప్రేమని అంగీకరించలేదు. అందుకు చాలా బాధ పడ్డా అని తెలిపాడు. కొంత కాలంగా సంధ్య నాతో మాట్లాడడం లేదు. సంధ్యకు ఫోన్ చేస్తే ఆ షాప్ లో ఉన్న మరో వ్యక్తి ఫోన్ లిఫ్ట్ చేసేవాడు. సంధ్య జోలికి రావద్దంటూ బెదిరించేవాడు. సంధ్య వేరే వ్యక్తితో క్లోజ్ కావడం బాధించింది. అందుకే చంపానని ఉన్మాది కార్తీక్ తెలిపాడు.

Comments