ప్రచురణ తేదీ : Apr 5, 2018 12:55 PM IST

సల్మాన్ కు షాక్ ఇచ్చిన కోర్టు.. అప్పటివరకు జైలులోనే!

కృష్ణా జింకలను వేటాడిన కేసులో సల్మాన్ ఖాన్ నేరారోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ కేసుపై రాజస్థాన్‌లోని జోధ్‌పుర్‌ న్యాయస్థానం ఫైనల్ తీర్పును ఇచ్చింది. రెండు సంవత్సరాల వరకు కఠిన కారాగార శిక్ష విధిస్తున్నట్టు జోధ్ పూర్ న్యాయస్థానం సంచలన నిర్ణయం తీసుకుంది. కొద్దిసేపటి క్రితం వెలువడ్డ ఈ తీర్పు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. గత 20 ఏళ్లుగా సల్మాన్ కోర్టుకు వెళ్లడం రావడం జరుగుతూనే ఉంది. అయితే ఈ రోజు న్యాయస్థానం తీర్పును వెలువరించింది. ఫైనల్ గా అతను దోషి అని చెప్పి మిగతావారిని నిర్దోషులుగా తేల్చి చెప్పింది. మొదట ఆరేళ్ల వరకు శిక్ష పడుతుందని అనుకున్నారు.

1998 లో జోధ్ పూర్ లో షూటింగ్ నిర్వహిస్తుండగా సల్మాన్ విహారయాత్ర అంటూ జింకలను వేటాడిన సంగతి తెలిసిందే. హమ్ సాథ్ సాథ్ హైన్ సినిమా షూటింగ్ నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. వారితో పాటు సైఫ్ అలీ ఖాన్ – టబు – నీలిమ్ – సోనాలి బింద్రే కూడా ఘటన జరిగినప్పుడు ఉన్నారు. కోర్టు వారికి కూడా నోటీసులను అందించింది. అయితే వారికి ఎటువంటి సంబంధం లేదని నిర్దోషులుగా తేల్చింది. ఇకపోతే కేసు నమోదవ్వగానే అప్పట్లో సల్మాన్ వారం రోజులు జోధ్ పుర్ లో జైలు జీవితాన్ని గడిపాడు. ఆ తరువాత కోర్టు అతనికి బెయిల్ ఇచ్చింది. ఇకపోతే రీసెంట్ గా.. అంటే మార్చ్ 28న కేసుకు సంబందించిన వాదనలు పూర్తయ్యాయి. ఇక ఇప్పుడు కోర్టు రెండేళ్ల జైలు శిక్షను ఖరారు చేసింది. మరో వైపు అభిమానులు ఆందోళనలకు దిగకుండా ముందు నుంచే పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. సల్మాన్ ని స్థానిక జైలుకి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.

Comments