ప్రచురణ తేదీ : Jan 9, 2018 5:08 PM IST

రోహిత్ – ధావన్ టెస్టుకు సెట్ కారు.. ఎందుకు తీసుకున్నారు?

వరుస విజయాలతో దూసుకుపోతోన్న టీమ్ ఇండియాకు కొత్త ఏడాది సఫారీలు బ్రేక్ వేశారు, సౌత్ ఆఫ్రికాతో జరిగిన మొదటి టెస్టులో ఇండియా 72 పరుగుల తేడాతో ఓటమి చెందిన సంగతి తెలిసిందే. భారత బౌలర్లు చాలా వరకు కష్టపడినా కూడా బ్యాట్స్ మెన్లు మాత్రం చాలా వరకు చేతులెత్తేశారు. సౌత్ ఆఫ్రికా బౌలింగ్ ధాటికి మన బ్యాట్స్ మెన్లు ఏ తరహాలోను అడ్డుకోలేదు. అయితే ప్రస్తుత జట్టు ఎంపికపై చాలా వరకు విమర్శలు వెలువడుతున్నాయి. కోహ్లీ నాయకత్వంలో జట్టులో ఫార్మాట్ కి సెట్ కానీ ఆటగాళ్లను సెలెక్ట్ చేశారని పలువురు మాజీ క్రికెటర్లు ఆరోపణలు చేశారు. ముఖ్యంగా ధావన్ రోహిత్ లను టెస్టులో సెలెక్ట్ చేయడం తో సెలెక్షన్ కమిటీపై సోషల్ మీడియాలో కొన్ని నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఎందుకంటే రహానే టెస్టు ఫార్మాట్ లో మంచి ఆట తీరును కనబరచగలడు. అంతే కాకుండా సఫారిల గడ్డపై మంచి రికార్డ్ ఉంది. నాలుగేళ్ల క్రితం దక్షిణాఫ్రికా టూర్ లో అద్భుతంగా రానించాడు. కానీ అతన్ని సెలెక్ట్ చేసుకోకుండా రోహిత్ నీ తీసుకున్నారు. అతను రెండు ఇన్నింగ్స్ లో కలిపి 30 పరుగులు కూడా చేయలేకపోయాడు.

Comments