ప్రచురణ తేదీ : Dec 5, 2017 6:37 PM IST

కథ అడ్డం తిరిగింది..విశాల్ ఆశలు గల్లంతు..!

సినీ హీరో విశాల్ కు భారీ షాక్ తగిలింది. రాజకీయ నాయకుడిగా ఎదగాలనుకున్న విశాల్ కు ఆదిలో హంస పాదు ఎదురైంది. 300 మంది అనుచరులతో విశాల్ నిన్న ఆర్కే నగర్ ఉపఎన్నిక కోసం నామినేషన్ దాఖలు చేశారు. విశాల్ నామినేషన్ ని ఎన్నికల రిటర్నింగ్ అధికారి రిజెక్ట్ చేశారు. నామినేషన్ లో విశాల్ వివరాలని సరిగా పొందుపరచలేదని అందువల్లనే నామినేషన్ తిరస్కరించాల్సి వచ్చిందని రిటర్నింగ్ అధికారి తెలిపారు. జయ మేనకోడలు దీప జయకుమార్ నామినేషన్ ని కూడా రిటర్నింగ్ అధికారి తిరస్కరించిన సంగతి తెలిసిందే.

విశాల్, దీప నామినేషన్లు తిర్కరణకు వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. దీనితో ఆర్కే నగర్ బై పోల్ లో ప్రధాన పార్టీల మధ్యే పోటీ నెలకొనబోతోంది. అన్నా డిఎంకె అభ్యర్థిగా మధుసూదన్, డీఎంకే అభ్యర్థిగా గణేష్, బిజెపి అభ్యర్థిగా నాగరాజన్,అన్నా డీఎంకే నుంచి వెలివేయబడ్డ నేత దినకరన్ ప్రస్తుతం ఎన్నికల బరిలో ఉన్నారు. తన నామినేషన్ తిరస్కరణకు గురి కావడంతో విశాల్ రిటర్నింగ్ అధికారి ఆఫీస్ వద్ద తన అనుచరులతో ధర్నాకు దిగారు. కుట్ర ప్రకారమే తనని పక్కకు తప్పించారని విశాల్ ఆరోపించారు.

Comments